న్యూఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీతో కలిశారని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ విజయాలపై పారిశ్రామికవేత్త, న్యాయవాది కిలారు దిలీప్ రూపొందించిన పుస్తకాన్ని దత్తాత్రేయ ఆవిష్కరించారు. నోట్ల రద్దు చేయమని లేఖ రాశానని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు దాన్ని తప్పుపట్టడం దేనికి సంకేతమని ధ్వజమెత్తారు.
తెలుగు జాతి చరిత్రలో టీడీపీ, కాంగ్రెస్ కలవడం ఓ విషాదకర పరిణామమని అభివర్ణించారు. తెలంగాణలో మహాకూటమి అతలాకుతలంలో ఉందన్నారు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌లో రూ.86 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆర్టీఐ సమాచారం ద్వారా తెలుస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment