‘ఆ సమాచారం ఇస్తే రూ కోటి’ | Benami property secret informers to get reward of Rs 1 crore | Sakshi
Sakshi News home page

‘ఆ సమాచారం ఇస్తే రూ కోటి’

Published Fri, Sep 22 2017 8:31 PM | Last Updated on Fri, Sep 22 2017 11:13 PM

Benami property secret informers to get reward of Rs 1 crore

సాక్షి,న్యూఢిల్లీః బినామీ ఆస్తులపై దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇచ్చే వారికి రూ కోటి వరకూ నజరానాలిచ్చేందుకు కేంద్రం యోచిస్తోంది. ఈ సమాచారం ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు. నగదు రివార్డులకు సంబంధించి వచ్చే నెలలో ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు చెందిన ఓ అధికారి ఈ విషయం వెల్లడించారు. బినామీ ఆస్తులపై సమాచారం ఇచ్చే వారికి కనిష్టంగా రూ 15  లక్షల నుంచి గరిష్టంగా రూ కోటి వరకూ నగదు రివార్డ్‌ అం‍దించనున్నారు.
 
గత ఏడాది ప్రవేశపెట్టిన బినామీ ఆస్తుల చట్టంలో ఈ నిబంధన లేకున్నా ఆదాయ పన్ను శాఖ, ఈడీ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ వంటి దర్యాప్తు సంస్థలు రివార్డులు ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్నదేనని అధికారులు పేర్కొన్నారు. ఇన్‌ఫార్మర్ల సాయం తీసుకుంటే తమ పని మరిం‍త సులువవుతుందని పన్ను అధికారులు భావిస్తున్న క్రమంలో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement