న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై పోరుకు సహకరించుకోవాలని భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఒప్పందం చేసుకున్నాయి. ఈ మేరకు శుక్రవారం ఇరు పక్షాలు అంగీకరిస్తూ ఒక ప్రకటన (డిక్లరేషన్)ను విడుదల చేశాయి. భారత్–ఈయూ 14వ సదస్సు శుక్రవారం ఢిల్లీలో జరిగింది.
ఈ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ ఫ్రాన్సిజెక్ టస్క్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్ క్లాడ్ జంకర్, ఇతర ఈయూ నాయకులు పాల్గొన్నారు. సదస్సు అనంతరం సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘ఉగ్రవాదంపై పోరు, భద్రత అంశాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించాము’ అని తెలిపారు. టస్క్ మాట్లాడుతూ ‘అతివాదం, తీవ్రవాదం, ఉగ్రవాదంపై పోరాడాలని ఉమ్మడిగా తీర్మానించాము’అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment