సోనియాజీ.. కాల్చుకు చచ్చేందుకు అనుమతించండి!
సోనియాజీ.. కాల్చుకు చచ్చేందుకు అనుమతించండి!
Published Mon, Mar 31 2014 3:53 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
ఖాలిస్తానీ ఉగ్రవాది దేవీందర్ పాల్ సింగ్ భుల్లర్ మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఆలిండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ నేత మనీందర్ జీత్ సింగ్ బిట్టా తనను తాను కాల్చుకుని చనిపోయేందుకు అనుమతినివ్వమని ఏఐసీసీ అధ్యక్షులు సోనియా గాంధీని కోరారు.
'నన్ను చంపేందుకు కుట్రపన్ని కాల్పులు జరిపిన భుల్లర్ కి శిక్షను తగ్గించడం రాజకీయ టెర్రరిజం తప్ప మరేమీ కాదు. ఇక నేను బతికి ఉండి లాభం ఏమిటి? ఉగ్రవాదంపై పోరాటం చేసిన వారందరూ ఈ తీర్పులతో ఓడిపోయినట్టే. కాబట్టి కాల్చుకు చనిపోవడానికి నాకు అనుమతి ఇవ్వండి' అని ఆయన సోనియా గాంధీని కోరారు.
1993 సెప్టెంబర్ లో భుల్లర్ ఢిల్లీలో బాంబులు పేల్చాడు. ఈ ఉగ్రవాద ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. బిట్టా సహా 25 మంది గాయపడ్డారు. ఈ సంఘటనలో భుల్లర్ ఒక కాలును కోల్పోయారు. తనను చంపేందుకు యత్నించిన వ్యక్తికి క్షమాభిక్ష పెట్టడాన్ని బిట్టా తీవ్రంగా నిరసిస్తున్నారు.
Advertisement