కమాల్ సర్కార్.. | BJP appears inclined to form government in Delhi | Sakshi
Sakshi News home page

కమాల్ సర్కార్..

Published Fri, Sep 5 2014 11:36 PM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

కమాల్ సర్కార్.. - Sakshi

కమాల్ సర్కార్..

బీజేపీని ఆహ్వానించాలని రాష్ట్రపతికి ఎల్జీ నివేదిక?
ఎన్నికలు ఉండబోవని పరోక్షంగా వెల్లడించిన హోంశాఖ మంత్రి
ప్రభుత్వ ఏర్పాటు సంకేతాలు పంపుతున్న ఢిల్లీ బీజేపీ
రాజ్‌నాథ్-గడ్కరీ సమావేశం
ఎల్జీ తీరును ఎండగట్టిన కాంగ్రెస్, ఆప్ పార్టీలు
బేరసారాలను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపణ
సాక్షి, న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందా? నగరంలో చోటుచేసుకుంటు న్న పరిణామాలు, నేతలు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఇదే అభిప్రాయం కలుగుతోంది. అసెం బ్లీలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతించాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాష్ట్రపతికి నివేదిక సమర్పించారనే వార్తల నేపథ్యంలో నగరంలో బీజేపీ సర్కారు ఏర్పాటుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిం దిగా ఎల్జీ ఆహ్వానించే అవకాశముందని చెబుతున్నారు.

ఎల్జీ నుంచి ఆహ్వానం అందగానే అసెం బ్లీలో బీజేపీ బలనిరూపణ చేసుకోవాల్సి ఉంటుం ది. ఇదే విషయమై రాష్ట్రపతికి నజీబ్ జంగ్ నివేదిక పంపారని, ఆ నివేదికను రాష్ట్రపతి, హోంశాఖకు పంపారని చెబుతున్నారు. హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ప్రభుత్వ ఏర్పాటు విషయమై బీజేపీ ఆలోచిస్తోందని చెప్పారు. దీంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమనే సంకేతాలను ఆయన పరోక్షంగా వెల్లడించారు.

దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై వినిపిస్తున్న ఊహాగానాలు నిజమైతే.. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీ బీజేపీని నగరంలో ప్రభు త్వ ఏర్పాటు కోసం లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానించవచ్చు. ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని అహ్వానించి అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవలసిందిగా కోరవచ్చు. ఇదిలా ఉండగా ఈ విషయమై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఢిల్లీ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్ నితిన్ గడ్కరీని కలిశారు. ఆ తరువాత గడ్కరీ, హోంమంత్రి సమావేశమయ్యారు.
 
మండిపడుతున్న ఆప్..
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సుముఖంగా లేమని బీజేపీ ఓవైపు చెబుతున్నా ఆ పార్టీని ఎలా ఆహ్వానిస్తారని ఆప్ ప్రశ్నించింది. మెజార్టీ ఉన్న పార్టీలనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని డిమాండ్ చేసింది. ఏ పార్టీకి సరిపడా మెజార్టీ లేనప్పుడు ఎన్నికలకు వెళ్లాలంటూ రాజ్యంగమే చెబుతోందని, ఈ విషయమై ప్రణబ్ ముఖర్జీని మరోసారి కలుస్తామని, ఎమ్మెల్యేల బేరసారాలకు ఢిల్లీ అసెంబ్లీని వేదికగా మార్చవద్దని కోరతామని మెజార్టీని నిరూపించుకోవాల్సిందిగా ముందు పార్టీలను ఆహ్వానించి, ఆ తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించాలని తాము డిమాండ్ చేస్తున్న విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామని ఆప్ ఢిల్లీ కన్వీనర్ అశుతోష్ తెలిపారు.
 
బీజేపీలో భిన్నస్వరాలు..
ప్రత్యర్థి పార్టీలను చీల్చి ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై బీజేపీలో కూడా బిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కానీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఏర్పాటు కోసం పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. ఉన్న అవకాశాన్ని వదులుకొని ఎన్నికల కోసం ప్రయత్నించడం మూర్ఖత్వమే అవుతుందని, ఎన్నికల తర్వాత ఫలితాలు కచ్చితంగా బీజేపీకే అనుకూలంగా ఉంటాయని చెప్పడం కష్టమనే అభిప్రాయాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.
 
ఏలా ఏర్పాటు చేస్తారు?
బీజేపీకి కూడా సరిపడినంతగా సంఖ్యాబలం లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ ఏం చే స్తుందనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందు అసెంబ్లీలో బీజేపీ సం ఖ్యాబలం 32. లోక్‌సభ ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు పోటీ చేసి, గెలవడంతో వారు పార్లమెంట్‌కు వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం బీజేపీ బలం 29కి చేరింది. అయితే పార్లమెంట్‌కు ప్రాతి నిథ్యం వహిస్తున్న ఎంపీలు కూడా బల నిరూపణ సమయంలో ఓటింగ్‌లో పాల్గొంటారని బీజేపీ చెబుతోంది. వారు ఇంకా అసెంబ్లీ సభ్యత్వానికి రాజీ నామా చేయనందున ఓటింగ్‌లో పాల్గొనే అవకాశముందని చెబుతున్నారు. మరోవైపు ఆప్ బహిష్కృత నేత బిన్నీ కూడా బీజేపీకి మద్దతు పలుకుతానని శుక్రవారం మరోమారు ప్రకటించారు. దీంతో మ్యాజిక్ ఫిగర్‌కు బీజేపీ చేరువవుతుందని చెబుతున్నారు.
 
నివేదికలో ఏముంది?

విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం... రాజధానిలో రాజకీయ పరిస్థితిని వివరిస్తూ నజీబ్‌జంగ్  రాష్ట్రపతికి వివరంగా నివేదిక పంపారు. ఢిల్లీ లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పాటుచేయవలసిన ఆవశ్యకతను ఆయన తన నివేదికలో నొక్కిచెప్పారు. నగరంలో ఎన్నికలు జరిపించే ప్రతిపాదనను పరిశీలించడానికి ముందు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అవకాశాలను అన్వేషించాలని, బీజేపీ అసెంబ్లీలో అతి పెద్ద పార్టీ కాబట్టి దానిని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని ఆయన సిఫారసు చేశారు.
 
ఆప్ ఇప్పుడేం చేస్తుంది?
అర్వింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాజీనామా చేసిన తరువాత  ఢిల్లీలో పిబ్రవరి 17 నుంచి రాష్ట్రపతిపాలన కొనసాగుతోంది. సెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి రాష్ట్రపతిపాలన విధించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు తలుపులు తెరిచే ఉన్నాయి. అయితే ఇం తవరకు  ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేదు. ఢిల్లీలో సెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు జరిపించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ దాఖ లు చేసిన పిటిషన్  మంగళవారం సుప్రీంకోర్టులో  విచారణకు రానుంది. సెప్టెంబర్ 9న నగరంలో ప్రభుత్వం ఏర్పాటుపై తన వైఖరిని కేంద్రం న్యాయస్థానం ఎదుట స్పష్టం చేయాల్సి ఉంది.

ఒకవేళ న్యాయస్థానం ఎదుట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేం దుకే తాము సుముఖంగా ఉన్నట్లు కేంద్రం చెబితే ఆప్ అందుకు వ్యతిరేకంగా ఉద్యమించే అవకాశముందని చెబుతున్నారు.ఆప్ నేత మనీష్ సిసోడియా ఇప్పటికే ఈ దిశగా సంకేతాలు పంపారు. ఎల్జీ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ డిసెంబర్ 12న 32 మందితో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నిరాకరించిన పార్టీ ఇప్పుడు 29 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఈ విషయం తెలిసినప్పటికీ ఎల్జీ బీజేపీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిం చాలనుకోవడం రాజ్యాంగాన్ని ఎగతాళి చేయడమేనని ఆయన అన్నారు.
 
లోక్‌సభ ఎన్నికల్లో ఏడు స్థానాలను గెలిచిన బీజేపీ ఇప్పుడు ఎన్నికలకు భయపడుతోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి  బీజేపీ పార్టీ మార్పిడిలను ప్రోత్సహించినట్లయిలే అది దురదృష్టకరమని ఆయన చెప్పారు. పార్టీకి ప్రజాదరణ తగ్గిన విషయాన్ని బీజేపీ గుర్తించిందని, అందుకే  ఎన్నికలకు భయపడుతోందని మరోనేత అశుతోష్ ఎద్దేవా చేశారు. డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పాటుచేయాడానికి  లిఖిత పూర్వకంగా నిరాకరణ తెలిపిన పార్టీని లెప్టినెంట్ గవర్నర్ ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం ఏర్పాటుకు ఎలా ఆహ్వానిస్తారని ఆశుతోష్ ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే గుండు కొట్టించుకుంటానని మరో నేత సోమ్‌నాథ్ భారతి అన్నారు.
 
ఇవీ పరిణామాలు...
లోక్‌సభ ఎన్నికల తర్వాత ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ సంఖ్యా బలం మరింత తగ్గింది. ముగ్గురు ఎమ్మెల్యేలు పార్లమెంట్‌కు పోటీ చేసి, గెలిచారు. దీంతో బీజేపీ బలం 32 నుంచి 29 కి చేరింది.
ఎంపీలుగా గెలిచిన ముగ్గురు బీజేపీ సభ్యులు అసెంబ్లీ సభ్యత్వానికి ఇంకా రాజీనామా చేయకపోవడంతో బలనిరూపణ సమయంలో ఈ ముగ్గురు కూడా ఓటింగ్‌లో పాల్గొనే అవకాశముంటుంది.
1998లో వాజ్‌పేయి సర్కారును గద్దె దింపడం కోసం ఒరిస్సా ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగ్ లోక్‌సభలో ఓటేసినట్లుగా ముగ్గురు బీజేపీ ఎంపీ లు అసెంబ్లీలో ఓటేసే అవకాశముంది.
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కృతుడైన వినోద్‌కుమార్ బిన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. ఈ విషయాన్ని శుక్రవారం కూడా ఆయన పునరుద్ఘాటించారు.
సెప్టెంబర్ 9న నగరంలో ప్రభుత్వం ఏర్పాటుపై కేంద్రం తన వైఖరిని న్యాయస్థానం ఎదుట స్పష్టం చేయాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement