సీమాంధ్ర, తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి దారుణం: జైట్లీ
తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లోని ప్రాంతీయ పార్టీలతో ఎన్నికల పొత్తుపై త్వరలోనే ఓ అవగాహనకు వస్తామని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ విశ్వాసం ప్రకటించారు. అటల్ బీహారీ వాజ్ పేయి నాయకత్వం మూడు పార్టీల మధ్య అలయెన్స్ 24 పార్టీలకు చేరుకున్న అంశాన్ని జైట్లీ గుర్తు చేశారు. సీమాంధ్ర, తెలంగాణలోని పార్టీలతో పొత్తుపై త్వరలోనే ఓ సానుకూల ప్రకటన వెలువడుతుందని ఆయన తెలిపారు.
తమిళనాడులో ఆరు పార్టీల పొత్తు కుదిరిన తర్వాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పొత్తులపై దృష్టిసారించనట్టు ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. 2004, 2009 సంవత్సరాల్లో ఏర్పడిన యూపీఏ ప్రభుత్వంలో తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ లు కీలక పాత్ర పోషించని అంశాన్ని గుర్తు చేశారు. అయితే ఈసారి ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉందని ఆయన అన్నారు.