ఫుల్లుగా తాగి.. కారుతో యువతిని ఛేజ్‌ చేసి! | BJP leader Subhash Barala son held for harrasment | Sakshi
Sakshi News home page

ఫుల్లుగా తాగి.. కారుతో యువతిని ఛేజ్‌ చేసి!

Published Sat, Aug 5 2017 7:18 PM | Last Updated on Sun, Sep 17 2017 5:12 PM

ఫుల్లుగా తాగి.. కారుతో యువతిని ఛేజ్‌ చేసి!

ఫుల్లుగా తాగి.. కారుతో యువతిని ఛేజ్‌ చేసి!

యువతిపై వేధింపుల కేసులో హర్యానా బీజేపీ అధ్యక్షుడి కుమారుడు సహా ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హర్యానా బీజేపీ అధ్యక్షుడు సుభాష్‌ బారాలా కుమారుడు వికాస్‌ బరాలాతోపాటు అతని స్నేహితుడు ఆశిష్‌ కుమార్‌ శుక్రవారం రాత్రి ఓ యువతిపై వేధింపులకు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో వెంటనే స్పందించిన పోలీసులు ఈ ఇద్దరిని అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం శనివారం బెయిల్‌పై వికాస్ విడుదలయ్యారు.

పోలీసుల కథనం ప్రకారం.. చండీగఢ్‌లో ఓ యువతి శుక్రవారం రాత్రి ఓ కారులో తన ఇంటికి వెళ్తున్నారు. మద్యం మత్తులో ఉన్న వికాస్ తన స్నేహితుడు అశిష్‌తో కలిసి తమ ఎస్‌యూవీ వాహనంతో వెంబడించారు. కారు ఆపాలని యువతిని పదే పదే హెచ్చరిస్తున్నా ఏ మాత్రం భయపడకుండా పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్‌కు కాల్ చేసి విషయాన్ని చెప్పారు. వారు అక్కడికి చేరుకునేలోగా ఆమె ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు కారు నడిపినా చివరికి ఆమెను నిలువరించి వేధించడం మొదలుపెట్టారు. సమయానికి అక్కడికి చేరుకున్న పోలీసులు వికాస్ తో పాటు అశిష్‌లను అరెస్ట్ చేశారు. సెక్టర్ 26లోని పీఎస్‌లో కేసు నమోదుచేశారు.

అరెస్ట్‌ చేసిన ఇద్దరిని శనివారం బెయిల్‌పై విడుదల చేసినట్లు చండీగఢ్‌ డిప్యూటీ ఎస్పీ సతీష్‌కుమార్‌ వెల్లడించారు. యువతి వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ రికార్డు చేశారని తెలిపారు. నిందితులపై 354డీ తోపాటు మోటారు వెహికల్‌ యాక్ట్‌లోని ఐపీసీ 185 సెక్షన్ కింద కేసులు నమోదు చేసి విచారణ చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement