సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీని ప్రభుత్వం ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) నజీబ్ జంగ్ గురువారం ఆహ్వానిస్తారని, బీజేపీ దీనికి అంగీరిస్తుందని ఆప్ చెప్పిన జోస్యం నిజం కాలేదు. జంగ్ గురువారం సాయంత్రం వరకు బీజేపీని ఆహ్వానించలేదు. ఢిల్లీ లో ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి తలుపులు తెరిచే ఉన్నాయని, ఎల్జీ ఆహ్వానిస్తే ఇందుకు అంగీకరిస్తామని బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ స్పష్టం చేయ డం తెలిసిందే. దీంతో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుపై ఆశలు చిగురించాయి. బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నికలకన్నా ప్రభుత్వం ఏర్పాటువైపే మొగ్గు చూపుతున్నందు వల్ల సీనియర్ ఎమ్మెల్యే జగదీశ్ ముఖి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. నరేంద్ర మోడీ విదేశీ యాత్ర ముగించుకుని వచ్చిన తరువాత దీనిపై నిర్ణయం వెలువడవచ్చని ఆశించారు.
అయితే ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి, ఢిల్లీ ఎన్నికల ఇన్‌చార్జ్ నితిన్ గడ్కరీ గురువారం తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటుపై సరైన సమయంలో సరైన నిర్ణ యం తీసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేయాలనేది పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని అన్నారు. ‘మాది ప్రజాస్వామ్య పార్టీ. ఎమ్మెల్యేలు ఏం కోరుతున్నారనే దానికన్నా, పార్టీ అత్యున్నత సంస్థ ఏం కోరుకుంటుందో అది ముఖ్యం’ అని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతున్నారన్న కేజ్రీవాల్ ఆరోపణలను ఆయన ఖండించారు. ఆప్ తన ఆరోపణలకు రుజువు లు చూపాలని గడ్కరీ డిమాండ్ చేశారు. ‘ఇదంతా పబ్లిసిటీ స్టంట్. కేజ్రీవాల్ తన పార్టీనే అదుపులో పెట్టుకోలేకపోతున్నారు. ప్రజలు ఆయన మాటలను నమ్మడానికి ఇప్పుడు సిద్ధంగా లేరు’ అని గడ్కరీ అన్నారు.
కొనసాగుతున్న అనిశ్చితి
Published Thu, Jul 17 2014 10:57 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement