బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత | BJP MLA Dharmpal Chaudhary Is Passed Away | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత

Published Thu, Apr 19 2018 10:51 AM | Last Updated on Thu, Apr 19 2018 11:48 AM

BJP MLA Dharmpal Chaudhary Is Passed Away - Sakshi

జైపూర్‌ : రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లా మండావర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే ధర్మ్‌పాల్‌ చౌదరీ గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మరణించారు. తీవ్ర గుండె నొప్పితో గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన చిక్సిత పొందుతూ మృతి చెందారు. భారతీయ జనతా పార్టీ నుంచి 2003లో మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ధర్మ్‌పాల్‌ ఆ తర్వాత 2008, 2014లో కూడా మండావర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జాట్‌ సామాజిక వర్గానికి చెందిన ధర్మ్‌పాల్‌, జాట్ల ఉద్యమ సమయంలో ముఖ్య భూమిక పోషించారు. 2016లో ఓ జర్నలిస్టును ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడుతున్న టేపు బయటపడ్డ  విషయంలో వార్తల్లో నిలిచిని ధర్మ్‌పాల్‌, ఆ జర్నలిస్టు తాను చెప్పింన దాన్ని వక్రీకరించి వార్తను తప్పుగా రాసినందుకే అలా అన్నానని వివరణ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement