Rajasthan BJP MLA
-
రాజస్థాన్ పీఠంపై బీజేపీ కన్ను.. ఎన్నికల సన్నద్ధత షురూ!
జైపుర్: దేశంలోని ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తూ తన ప్రబల్యాన్ని విస్తరించుకుంటోంది భారతీయ జనతా పార్టీ. తాజాగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే 2023లో శాసనసభ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌లో పాగా వేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జులై 10 నుంచి 12 వరకు మూడు రోజుల పాటు కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో సమావేశం కానున్నట్లు పేర్కొన్నాయి. రానున్న ఎన్నికల్లో విజయం సాధించేలా పార్టీ కార్యకర్తలు, నేతలకు ఈ క్యాంప్‌కు హాజరయ్యే జాతీయ స్థాయి నాయకులు ఎన్నికల వ్యూహాలను వివరించనున్నారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా వారికి శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ శిబిరం ప్రారంభానికి ఒక రోజు ముందే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ జైపుర్ చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ట్రైనింగ్ క్యాంప్ అనంతరం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతు తెలిపిన హిందూ వ్యక్తి హత్యకు గురైన విషయం, ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులపై ఈ భేటీలో చర్చించనున్నారు. శిక్షణ శిబిరానికి వచ్చే నేతలెవరు? రాజస్థాన్‌లో మూడు రోజుల పాటు నిర్వహించి ట్రైనింగ్ క్యాంప్‌కు పలువురు జాతీయ స్థాయి నేతలు హాజరుకానున్నారు. అందులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు వీ సతీశ్, బీఎల్ సంతోష్, రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియా, కేంద్ర మంత్రులు.. కైలాశ్ చౌదరి, అరుణ్ రామ్ మెఘ్వాల్, గజేంద్ర సింగ్ శేఖావత్, ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా, మాజీ ముఖ్యమంత్రి వసుందర రాజే సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. చదవండి: మేడమ్ టుస్సాడ్స్ నుంచి రోడ్డుపైకి బోరిస్ మైనపు విగ్రహం -
'పౌరసత్వ చట్టం నచ్చని వారు సముద్రంలోకి దూకండి'
జైపూర్: జాతీయ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా నిరసన తెలిపేవారంతా దేశానికి శత్రువులేనంటూ రాజస్తాన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఏఏను వ్యతిరేకిస్తూ దేశంలో అల్లర్లు, ఆందోళనలు సృష్టించి దేశానికి సంబంధించిన ఆస్తుల్ని తగలబెడుతున్నవారంతా దేశ ద్రోహులేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చదవండి: రాజకీయాలకు పనికిరానంటూ ఎమ్మెల్యే రాజీనామా! జాతీయ పౌరసత్వ చట్ట సవరణ నచ్చకుంటే అలాంటి వారంతా పాకిస్తాన్‌కు వెళ్లిపోవచ్చు. లేదంటే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇలా.. వారికి నచ్చిన దేశానికి వెళ్లిపోండి. ఆ దేశాలు ఒప్పుకోకుంటే హిందూ మహా సముద్రంలో దూకండి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఏఏ నచ్చకపోతే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ అయినా సరే వేరే దేశాలకు వెళ్లిపోవచ్చని అన్నారు. సీఏఏను వ్యతిరేకించేవారికి ఈ దేశంలో నివసించే హక్కు లేదని మదన్ దిలావర్ వ్యాఖ్యానించారు. చదవండి: 'సీడీఎస్‌గా భవిష్యత్ వ్యూహాలు రచిస్తా: బిపిన్ రావత్' -
బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత
జైపూర్ : రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా మండావర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ధర్మ్‌పాల్ చౌదరీ గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మరణించారు. తీవ్ర గుండె నొప్పితో గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన చిక్సిత పొందుతూ మృతి చెందారు. భారతీయ జనతా పార్టీ నుంచి 2003లో మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ధర్మ్‌పాల్ ఆ తర్వాత 2008, 2014లో కూడా మండావర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన ధర్మ్‌పాల్, జాట్ల ఉద్యమ సమయంలో ముఖ్య భూమిక పోషించారు. 2016లో ఓ జర్నలిస్టును ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడుతున్న టేపు బయటపడ్డ విషయంలో వార్తల్లో నిలిచిని ధర్మ్‌పాల్, ఆ జర్నలిస్టు తాను చెప్పింన దాన్ని వక్రీకరించి వార్తను తప్పుగా రాసినందుకే అలా అన్నానని వివరణ ఇచ్చారు. -
మరోసారి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞానదేవ్ అహుజ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జేఎన్ యూ విద్యార్థులు క్యాంపస్ లో విచ్చలవిడిగా వ్యవహరిస్తారని అంతకుముందు వ్యాఖ్యానించిన ఆయన మళ్లీ తన నోటికి పదును పెట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో 50 శాతం అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసులకు జేఎన్ యూ విద్యార్థులే కారణమంటూ నోరు పారేసుకున్నారు. అంతకుముందుకు జేఎన్ యూ విద్యార్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వివరణ ఇవ్వాలని ఆయనను పార్టీ అధిష్టానం ఆదేశించింది. జేఎన్ యూ క్యాంపస్ లో ప్రతిరోజు 3 వేల కండోమ్ లు, గర్భనిరోధక ఇంజక్షన్లు వాడతారని అహుజ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.