మరోసారి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు | Gyandev Ahuja says JNU students responsible for 50% of rapes in Delhi | Sakshi
Sakshi News home page

మరోసారి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Published Fri, Feb 26 2016 12:19 PM | Last Updated on Sun, Sep 3 2017 6:29 PM

మరోసారి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

మరోసారి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞానదేవ్ అహుజ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జేఎన్ యూ విద్యార్థులు క్యాంపస్ లో విచ్చలవిడిగా వ్యవహరిస్తారని అంతకుముందు వ్యాఖ్యానించిన ఆయన మళ్లీ తన నోటికి పదును పెట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో 50 శాతం అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసులకు జేఎన్ యూ విద్యార్థులే కారణమంటూ నోరు పారేసుకున్నారు.

అంతకుముందుకు జేఎన్ యూ విద్యార్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వివరణ ఇవ్వాలని ఆయనను పార్టీ అధిష్టానం ఆదేశించింది. జేఎన్ యూ క్యాంపస్ లో ప్రతిరోజు 3 వేల కండోమ్ లు, గర్భనిరోధక ఇంజక్షన్లు వాడతారని అహుజ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement