సరి-బేసి రూల్ను బ్రేక్ చేసిన బీజేపీ ఎంపీ | BJP Parliamentarian Caught Breaking Delhi's Odd-Even Rule | Sakshi
Sakshi News home page

సరి-బేసి రూల్ను బ్రేక్ చేసిన బీజేపీ ఎంపీ

Published Fri, Jan 1 2016 5:24 PM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM

సరి-బేసి రూల్ను బ్రేక్ చేసిన బీజేపీ ఎంపీ - Sakshi

సరి-బేసి రూల్ను బ్రేక్ చేసిన బీజేపీ ఎంపీ

న్యూఢిల్లీ: ఢిల్లీలో కాలుష్య నివారణ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన సరి-బేసి నిబంధనను బీజేపీ ఎంపీ ఉల్లంఘించారు. సరి-బేసి రూల్ ప్రకారం ఢిల్లీలో శుక్రవారం బేసి సంఖ్య గల కార్లను మాత్రమే అనుమతించారు. అయితే ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ సరి నెంబర్ ప్లేట్ గల కారులో వెళుతూ ఇండియా గేట్ వద్ద కనిపించారు.  

కొత్త ఏడాదిని పురస్కరించుకుని ఈ రోజు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవుదినం కావడంతో ఢిల్లీలో రద్దీ తక్కువగా ఉంది. సరి-బేసి సంఖ్య గల వాహనాలను ఢిల్లీలో రోజు మార్చి రోజు అనుమతిస్తారు. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ విమర్శించింది. ప్రత్యామ్నాయ ప్రజా రవాణ ఏర్పాట్లు చేయకుండా ఈ నిబంధన అమలు చేయడాన్ని తప్పుపట్టింది. కాగా సరి-బేసి నిబంధన విజయవంతమైందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అయితే ఈ రూల్ను నిరంతరం అమలు చేయడం సాధ్యంకాదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement