యూపీలో గెలుపెవరిదంటే.. | BJP set to win Uttar Pradesh: Opinion Poll shows demonetisation is good for Modi | Sakshi
Sakshi News home page

యూపీలో గెలుపెవరిదంటే..

Published Wed, Jan 4 2017 9:14 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

యూపీలో గెలుపెవరిదంటే.. - Sakshi

యూపీలో గెలుపెవరిదంటే..

లక్నో: ఉత్తర్ప్రదేశ్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించనున్నట్టు ఇండియా టుడే - యాక్సిస్ సంయుక్తంగా నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వేలో వెల్లడైంది. బీజేపీకి 33 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని సర్వే తెలిపింది. నోట్ల రద్దు తర్వాత అనూహ్యంగా బీజేపీకి 31 నుంచి 33 శాతానికి ఓట్లు శాతం పెరిగింది. సమాజ్ వాదీ పార్టీకి 26 శాతం ఓట్లు మాత్రమే వచ్చే అవకాశముందని తేలింది.

బహుజన్ సమాజ్ వాదీపార్టీకి 92 నుంచి 97 సీట్లు వచ్చే అవకాశం ఉందిని సర్వే స్పష్టం చేసింది. కాంగ్రెస్కు 5-9 శాతం ఓట్లు, మిగితా పార్టీలకు 7-11 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది. సీఎం అభ్యర్థిగా అఖిలేష్ వైపు యూపీ ప్రజలు మొగ్గు చూపుతున్నారని ఈ సర్వే అభిప్రాయపడింది. 33 శాతం మంది అఖిలేష్ సీఎంగా కావాలని ఆకాంక్షిస్తున్నట్టు సర్వేలో తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement