'మమత తల తెగ నరికి తెస్తే బహుమతి' | BJYM leader offers reward of Rs.11 lakh for Mamata Banerjee's head | Sakshi
Sakshi News home page

'మమత తల తెగ నరికి తెస్తే బహుమతి'

Published Wed, Apr 12 2017 9:13 AM | Last Updated on Tue, Sep 5 2017 8:36 AM

'మమత తల తెగ నరికి తెస్తే బహుమతి'

'మమత తల తెగ నరికి తెస్తే బహుమతి'

ఆలీఘర్‌: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తలను తెగ నరికిన వారికి రూ.11 లక్షల రివార్డు ఇస్తానంటూ భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎమ్‌) నాయకుడు యోగేష్‌ వార్ష్నే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హనుమ జయంతి సందర్భంగా బిర్భమ్‌ జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో 'జై శ్రీరామ్‌' అంటూ నినాదాలు పెల్లుబిక్కాయి. దీంతో పోలీసులు ర్యాలీ చేస్తున్న వారిపై లాఠీ చార్జి చేశారు.
 
ఈ ఘటనపై మాట్లాడిన యోగేష్‌.. మమత తల తెగ నరికి తన దగ్గరికి తీసుకొచ్చిన వారికి రూ.11 లక్షల బహుమతి ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సరస్వతి పూజ, రామ నవమి లాంటి వాటిని జరుపుకోనివ్వరని అన్నారు. ఇఫ్తార్‌ పార్టీలను మాత్రమే మమత నిర్వహిస్తారని.. ఆమె మద్దతు ముస్లింలకేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, హనుమాన్‌ జయంతి సందర్భంగా నిర్వహించే ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement