న్యూఢిల్లీ : నల్లధనం కేసులో సుప్రీంకోర్టు మరొక సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రజల ద్వారా నల్లధనంపై సమాచారం తెలుసుకోవాలని ఉన్నత న్యాయస్థానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమాచారంపై కూడా విచారణ చేయించాలని సుప్రీంకోర్టు యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కాగా గుర్తించిన విషయాలను కాగ్ సంచలనం చేయరాదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారమిక్కడ వ్యాఖ్యానించారు.
కాగా నల్లకుబేరులందరి పేర్లూ వెల్లడించాల్సిందేనన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం బుధవారం 627 పేర్లతో కూడిన జాబితాను అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో కూడా ప్రభుత్వం ఇదే జాబితాను సిట్‌కు సమర్పించింది.
కాగా ఇదే అంశంపై 2011 సంవత్సరంలో నల్లధనం సృష్టిని, అక్రమ రవాణాను నిరోధించేందుకు, స్వాధీనం చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) చైర్మన్ నేతృత్వంలోని కమిటీకి ప్రజల నుంచి 3,300 ఇ-మెయిల్‌లు అందాయి.
నల్లధనం కేసులో మరో సిట్కు సుప్రీం యోచన!
Published Thu, Oct 30 2014 8:37 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
Advertisement