బ్లాక్ మనీ క్యాన్సర్ లాంటింది | Black money is cancer says swami | Sakshi
Sakshi News home page

బ్లాక్ మనీ క్యాన్సర్ లాంటింది

Published Thu, Feb 19 2015 8:35 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

Black money is cancer says swami

బ్లాక్ మనీ సమాజానికి క్యాన్సర్ లాంటిదని అన్నారు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని భారత్ కు తెప్పించేందుకు మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని, అయితే ఆ ప్రక్రియ ఆలస్యంతో కూడుకున్నదని పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్టాడిన ఆయన బ్లాక్మనీ అంశంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యం తనను అసహనానికి గురిచేసినప్పటికీ.. ఆలస్యమైనా ప్రక్రియ పరిపూర్ణంగా పూర్తికావాలని అధికశాతం ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు.

బ్లాక్ మనీని భారత్ రప్పించేందుకు ప్రధాని నరేంద్రమోదీ కంకణబద్ధులై ఉన్నారని, అయినా సరే ప్రతిపక్షాలు విమర్శలకు విడ్డూరమన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే విదేశీ కంపెనీలు పార్టిసిపేటరీ నోట్స్ (పీ-నోట్స్) తప్పనిసరిగా సమర్పించాలనే నిబంధనను ఎత్తివేయాలన్న రాంజెఠ్మలాని వాదనతో తాను ఏకీభవిస్తానన్నారు. బ్లాక్ మనీ పెరిగిపోవడానికి పీ-నోట్స్ కూడా ఓ కారణమేనంటూ తారాపూర్ కమిటీ పేర్కొనడాన్ని ఆయన ఉదహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement