లక్నో కోర్టు వద్ద బాంబు పేలుడు | Bomb Blast At Lucknow Court | Sakshi
Sakshi News home page

లక్నో కోర్టు వద్ద బాంబు పేలుడు

Published Thu, Feb 13 2020 1:36 PM | Last Updated on Thu, Feb 13 2020 4:09 PM

Bomb Blast At Lucknow Court - Sakshi

లక్నో :  ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని ఓ కోర్టు వద్ద బాంబు పేలుడు కలకలం రేపింది. రాష్ట్ర విధానసభకు కేవలం కిలో మీటర్‌ దూరంలోనే ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు లాయర్లు గాయపడినట్టుగా తెలుస్తోంది. దీంతో కోర్టు పరిసరాల్లో ఆందోళకర వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అలాగే ఘటన స్థలంలో మరో మూడు పేలని నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. 

ఈ దాడి తనను లక్ష్యంగా చేసుకునే జరిగిందని లక్నో బార్‌ అసోషియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ సంజీవ్‌ లోధి చెప్పారు. జీతూ యాదవ్‌ అనే లాయర్‌ ఈ పేలుడుకు కారణమని ఆరోపించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement