పోలీసుల మీద బాంబ్ దాడి చేసి పారిపోతున్న నేరస్తులు
కోల్‌కతా : వారంతా కరుడుగట్టిన నేరస్తులు.. విచారణ నిమిత్తం జైలులో ఉన్నారు. కానీ అక్కడి నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తున్నారు. దాంతో వారికో ఉపాయం తట్టింది. ఎలాను విచారణ నిమిత్తం తమను కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టు ఆవరణ కాబట్టి జనాలు కూడా బాగానే ఉంటారు. ఇలాంటి సమయంలో కోర్టు ఆవరణలోకి వచ్చినప్పుడు పోలీసుల మీద బాంబ్ దాడి చేశామనుకో.. అక్కడ తీవ్ర గందరగోళం ఏర్పడుతుంది. అంతే ఈ హాడావుడిలో మనం తప్పించుకోవచ్చు అని ప్లాన్ వేశారు. చదువుతుంటూ ఇదేదే పాత సినిమాల్లో కనిపించే సీన్‌లా అనిపించినా ఇదంతా నిజంగానే జరిగింది.
సినిమాను తలపించేలా జరిగిన ఈ ఎస్కేపింగ్ డ్రామా పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ముగ్గురు కరుడుగట్టిన నేరస్తులు జైలు నుంచి తప్పించుకోవడానికి ఇలా కోర్టు ప్రాగంణంలో పోలీసుల మీద బాంబ్ దాడి పథకం రచించారు. దాన్ని పక్కగా అమలు జరిపారు కూడా. కానీ ముగ్గురు నేరస్తుల్లో ఇద్దరూ మాత్రమే తప్పించుకోగలిగారు. కర్ణ బేరా అనే నేరస్తుడు పోలీసులకు చిక్కడంతో వీరి ప్లాన్ గురించి తెలిసింది. పోలీసులు మిగతా ఇద్దరు నేరస్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment