Under trail prisoner
-
విచారణ ఖైదీల వెతలు తీరేదెన్నడు?
దేశంలోని 1350 జైళ్లలో ప్రస్తుతం సుమారు 6 లక్షల 10 వేల మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో సుమారు 80 శాతం మంది నిందితులు విచారణ ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్నారు. వీరి స్వేచ్ఛగా జీవించే రాజ్యాంగ హక్కును దృష్టిలో పెట్టుకొని ఇటీవల సుప్రీంకోర్టు ‘సతేందర్ కుమార్ అంతిల్ వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ (సీబీఐ) కేసు తీర్పులో పలు ఆదేశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేసింది. నిందితులకు, విచారణలో ఉన్న ఖైదీలకు బెయిల్ జారీ చేసే విధానాన్ని సరళతరం చేసే ప్రత్యేక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేవాలని ఆదేశించింది. అలాగే పోలీసు అధికారులు ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించి వారిని అరెస్టు చేసే క్రమంలో సీఆర్పీసీలో తెల్పిన సెక్షన్ 41, 41ఏలోని నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ, గతంలో సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసు తీర్పులో తెల్పిన నిబంధనలను పాటించాలని పేర్కొంది. జైలు జీవితం గడుపుతున్న విచారణ ఖైదీలు, వారు చేసిన నేరా నికి విధించే శిక్షా సమయంలో 50 శాతం పూర్తి చేసిన వారిని దేశవ్యాప్తంగా ఉన్న మేజిస్ట్రేట్ కోర్టులు, హైకోర్టులు వారి బెయిల్ దరఖాస్తులను పరిశీలించి ఇతర న్యాయపరమైన నిబంధనలను పరిగణలోకి తీసుకొని తగు ఆదేశాల ద్వారా వారికి రెండు వారాల్లో బెయిల్ మంజూరు చెయ్యాలని ఆదేశించింది. అదేవిధంగా యాంటిసిపేటరీ బెయిళ్లకు సంబంధించిన నిందితుల దరఖాస్తులను కూడా పరిశీలించి ఆరు వారాల్లో తగు ఆదేశాలను జారీ చేయాలని సూచించింది. దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు పోలీసు వ్యవస్థలోనే జరుగుతున్నవని గుర్తించి, అనేక సందర్భాల్లో ప్రతిష్ఠాత్మకమైన తీర్పులను సుప్రీంకోర్టు వెలువరించింది. 2015లో ‘డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్’ కేసు తీర్పులో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన నేరాలు పోలీస్ స్టేషన్లలోనే జరుగుతున్నట్లు గుర్తించి, దేశంలోని అన్ని పోలీస్ ఠాణాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అంతకుముందు 2014లో ‘అర్నేశ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్’ కేసు తీర్పులో... ఏడు సంవత్సరాల వరకు శిక్షపడే అన్ని నేరాలకు సంబంధించిన నిందితులను ఉన్నట్లుండి అరెస్టు చేసి జైలుకు పంపకూడదని ఆదేశించింది. ఒకవేళ అలాంటి కేసుల్లో నిందితులను అరెస్టు చేయాలంటే అందుకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలని ఆదే శించింది. సంబంధిత పోలీస్ అధికారులు సదరు కోర్టుతీర్పు నిబంధనలను అతిక్రమించినట్లయితే కోర్టుధిక్కార నేరం కింద వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలని హైకోర్టులను ఆదే శించింది. కోర్టుల్లో కేసుల విచారణకు ఎక్కువ కాలం పట్టడం వల్ల నేరం చేసినవారూ, అమాయకులూ కూడా అన్యాయానికి గురవుతున్నారు. అందుకు కారణం ప్రభుత్వాలు దేశ జనాభాకు తగ్గట్లుగా కోర్టులు ఏర్పాటు చేయకపోవడం, న్యాయమూర్తులను నియమించకపోవడం. అలాగే పోలీసు వ్యవస్థ, కేసుల నమోదు ప్రక్రియ, కోర్టుల్లో విచారణ వంటివాటిపై ప్రాథమిక అవగాహన కల్పించే పాఠ్యాంశాలు విద్యలో భాగం కాకపోవడమూ మరోకారణం. అందుకే ప్రభుత్వాలు తక్షణం ఈ దిశలో చర్యలు తీసుకుని పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కాపాడాలి. (క్లిక్: ‘నడమంత్రపు’ ఎన్నికలకు సన్నాహాలా!) - కోడెపాక కుమారస్వామి సామాజిక కార్యకర్త -
సినిమాను తలపించేలా ప్లాన్ చేశారు..
కోల్‌కతా : వారంతా కరుడుగట్టిన నేరస్తులు.. విచారణ నిమిత్తం జైలులో ఉన్నారు. కానీ అక్కడి నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తున్నారు. దాంతో వారికో ఉపాయం తట్టింది. ఎలాను విచారణ నిమిత్తం తమను కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టు ఆవరణ కాబట్టి జనాలు కూడా బాగానే ఉంటారు. ఇలాంటి సమయంలో కోర్టు ఆవరణలోకి వచ్చినప్పుడు పోలీసుల మీద బాంబ్ దాడి చేశామనుకో.. అక్కడ తీవ్ర గందరగోళం ఏర్పడుతుంది. అంతే ఈ హాడావుడిలో మనం తప్పించుకోవచ్చు అని ప్లాన్ వేశారు. చదువుతుంటూ ఇదేదే పాత సినిమాల్లో కనిపించే సీన్లా అనిపించినా ఇదంతా నిజంగానే జరిగింది. సినిమాను తలపించేలా జరిగిన ఈ ఎస్కేపింగ్ డ్రామా పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ముగ్గురు కరుడుగట్టిన నేరస్తులు జైలు నుంచి తప్పించుకోవడానికి ఇలా కోర్టు ప్రాగంణంలో పోలీసుల మీద బాంబ్ దాడి పథకం రచించారు. దాన్ని పక్కగా అమలు జరిపారు కూడా. కానీ ముగ్గురు నేరస్తుల్లో ఇద్దరూ మాత్రమే తప్పించుకోగలిగారు. కర్ణ బేరా అనే నేరస్తుడు పోలీసులకు చిక్కడంతో వీరి ప్లాన్ గురించి తెలిసింది. పోలీసులు మిగతా ఇద్దరు నేరస్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
సినిమాను తలపించేలా ప్లాన్ చేశారు..
-
పోలీసుల దెబ్బలు తాళలేక..
సత్తుపల్లి(ఖమ్మం జిల్లా): పోలీసుల దెబ్బలు తాళలేక ఓ విచారణ ఖైదీ ఆత్మహత్యాయత్నం చేశాడు. తలను గోడకేసి బాదుకోవడంతో తీవ్రరక్త స్రావం అయింది. ఈ సంఘటన సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా ధర్మాజీగూడెంకు చెందిన వీరయ్యను ఓ దొంగతనం కేసులో పోలీసులు సత్తుపల్లి స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ చేస్తున్నారు. పోలీసుల దెబ్బలు తాళలేక తలను గోడకేసి వీరయ్య బాదుకున్నాడు. తీవ్రంగా రక్తం కారుతుండటంతో వీరయ్యను చికిత్స నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
పరారీ ఖైదీ లొంగిపోయాడు..
న్యాయవాది ద్వారా కోర్టుకు హాజరు చెన్నూర్ అటవీ ప్రాంతంలో బేడీలు గోదావరిఖని: కరీంనగర్ జిల్లా గోదావరిఖని కోర్టు నుంచి గురువారం ఎస్కార్ట్ సిబ్బంది కళ్లుగప్పి పరారైన అండర్ ట్రయల్ ఖైదీ నీలపు వంశీకృష్ణ శుక్రవారం అదే కోర్టులో పోలీసులకు లొంగిపోయాడు. పలు కేసుల్లో నిందితుడైన వంశీకృష్ణను ఓ హత్యకేసులో గురువారం కోర్టుకు తీసుకురాగా, పరారైన విషయం తెలి సిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు లు వంశీకృష్ణ తల్లిదండ్రులను తీసుకువచ్చి ఒత్తిడి తేవడంతో అతడు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. న్యాయవాది పూర్మ శ్రీనివాస్ ద్వారా శుక్రవారం కోర్టుకు వచ్చాడు. కోర్టు ప్రాంగణంలోనే వంశీకృష్ణను వన్‌టౌన్ సీఐ సీహెచ్.శ్రీధర్ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వంశీకృష్ణను అరెస్ట్ చేశామని, శనివారం కోర్టులో హాజరుపర్చుతామని సీఐ తెలిపారు. వంశీకృష్ణను బైక్‌పై తప్పించిన నాగరాజు కూడా పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చెన్నూరు అటవీ ప్రాంతంలో మకాం.. అయితే, వంశీకృష్ణ కోర్టు నుంచి తప్పించుకొని ఆదిలాబాద్ జిల్లా వైపు వెళ్లాడు. గోదావరినది బ్రిడ్జి దాటిన తర్వాత బైక్‌ను వదిలేసి మరో వాహనంలో చెన్నూర్ అటవీ ప్రాంతానికి చేరుకున్నాడు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు వంశీకృష్ణను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే వంశీకృష్ణ బంధువులు న్యాయవాదిని సంప్రదించారు. ఆయన అటవీ ప్రాంతానికి వెళ్లి వంశీకృష్ణను తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. వంశీకృష్ణ చేతులకు నూనె రాసి బేడీలను తొలగించుకుని చెన్నూర్ అటవీ ప్రాంతంలోనే పడేశానని తెలిపినట్టు న్యాయవాది వివరించారు. జైల్లో చంపుతాడనే భయానికే... కరీంనగర్ జిల్లా జైలులోనే ఉన్న మరో నిందితుడు తనని చంపుతాడనే భయంతోనే వంశీకృష్ణ పరారైనట్లు న్యాయవాది తెలిపారు. ఈ నెల 11న గోదావరిఖని ఐబీ కాలనీలో ప్రశాంత్ అలియాస్ సన్నీ అనే యువకుడి హత్య కేసులో చందు అనే నిందితుడిని జిల్లా జైలుకు తీసుకొచ్చారు. చందు, వంశీకృష్ణలు హైదరాబాద్‌లో ఉండగా, వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. తర్వాత వారు కలుసుకోలేదు. ఇరువర్గాల మధ్య వైరం అలాగే కొనసాగుతోంది. ఈ క్రమంలో చందు తనను చంపుతాడనే భయంతోనే పరారైనట్లు వంశీకృష్ణ చెప్పాడని న్యాయవాది సత్యనారాయణ పేర్కొన్నారు.