సత్తుపల్లి(ఖమ్మం జిల్లా):
పోలీసుల దెబ్బలు తాళలేక ఓ విచారణ ఖైదీ ఆత్మహత్యాయత్నం చేశాడు. తలను గోడకేసి బాదుకోవడంతో తీవ్రరక్త స్రావం అయింది. ఈ సంఘటన సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా ధర్మాజీగూడెంకు చెందిన వీరయ్యను ఓ దొంగతనం కేసులో పోలీసులు సత్తుపల్లి స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ చేస్తున్నారు.
పోలీసుల దెబ్బలు తాళలేక తలను గోడకేసి వీరయ్య బాదుకున్నాడు. తీవ్రంగా రక్తం కారుతుండటంతో వీరయ్యను చికిత్స నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పోలీసుల దెబ్బలు తాళలేక..
Published Thu, Feb 9 2017 5:55 PM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM
Advertisement
Advertisement