కోల్కతా ఎన్ఐఏ కార్యాలయం సమీపంలో బాంబు పేలుడు | Bomb blast near NIA office in Kolkata | Sakshi
Sakshi News home page

కోల్కతా ఎన్ఐఏ కార్యాలయం సమీపంలో బాంబు పేలుడు

Published Mon, Nov 10 2014 8:51 PM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM

Bomb blast near NIA office in Kolkata

కోల్కతా: కోల్కతాలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కార్యాలయం సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. సోమవారం రాత్రి దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. బుర్ద్వాన్ పేలుళ్ల నిందితుడు అంజాద్ను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. పేలుడుకు సీఆర్పీఎఫ్ క్యాంపస్ గోడ పాక్షికంగా దెబ్బతింది.

బుర్ద్వాన్ బాంబు పేలుళ్లకు సంబంధించి పశ్చిమబెంగాల్ పోలీసులు, ఎన్ఐఏ అధికారులు జమత్-ఉల్-ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ (జేఎమ్బీ)కి చెందిన ఇద్దరు టాప్ కమాండర్లను అరెస్ట్ చేశారు. శనివారం సాజిద్ అనే ఉగ్రవాద నాయకుడిని, సోమవారం అంజాద్ షేక్ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారిస్తున్న సమయంలో పేలుడు జరిగింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement