పంజాబ్పై రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్య | Can End Punjab's Drug Problem In A Month If We Come To Power: Rahul Gandhi | Sakshi
Sakshi News home page

పంజాబ్పై రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్య

Published Mon, Jun 13 2016 3:29 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

పంజాబ్పై రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్య - Sakshi

పంజాబ్పై రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్య

జలంధర్: పంజాబ్లో అత్యంత తేలికైనది డ్రగ్స్ వ్యాపారమేనని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్య చేశారు. తమ పార్టీకి అధికారం అప్పగిస్తే ఒక్క నెలలోనే రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేస్తానని ఆయన చెప్పారు. పంజాబ్ లో పెరిగి పోయిన మత్తపదార్థాల వినియోగం, శాంతిభద్రతల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాహుల్ నాయకత్వంలో జలంధర్లో సోమవారం అతిపెద్ధ ధర్నాకార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది.

ఈ సందర్భంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని, పంజాబ్ లోని శిరోమణి అకాళీదళ్ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు.
ఎప్పుడు చూసిన ప్రధాని నరేంద్రమోదీ వ్యాపారాల గురించే మాట్లాడుతారని, అవి కూడా తేలికైన వ్యాపారాల గురించేనని, పంజాబ్ లో అత్యంత తేలికైన వ్యాపారం డ్రగ్స్ అమ్మకాలేనని అన్నారు.

'పంజాబ్ ప్రభుత్వం డ్రగ్స్ని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే దానికి డ్రగ్స్ మాఫియా నుంచి లబ్ధి చేకూరుతుంది. మేం ఆ సమస్యను పరిష్కరించగలం. అది కూడా ఒక్క నెలలోనే. అందుకోసం మాకు అధికారాన్ని అప్పగించండి. పోలీసులు స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం కల్పించాలి. ఆ పని కాంగ్రెస్ చేయగలదు. మోదీగారు ఎప్పుడు వ్యాపారం చేయడంలో సులువైన మార్గాలే చెబుతుంటారు. పంజాబ్ లో తేలికైన బిజెనెస్ డ్రగ్స్' అని రాహుల్ అన్నారు. ఉడ్తా పంజాబ్ చిత్రానికి పెద్ద మొత్తంలో కట్ లు విధించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement