న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సాయానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రానికి 2015-16 నుంచి 2019-20 వరకే కేంద్ర సాయం అందనుంది. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి నిధులపై స్పష్టత ఇచ్చింది. 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం, 10 శాతం నిధులు రాష్ట్రం భరించేలా నిర్ణయం తీసుకుంది.
మరోవైపు విదేశీ సంస్థల నుంచి రుణం తీసుకునేందుకు ఏపీ సర్కార్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి 100 శాతం నిధులు ఇచ్చేందుకు కేబినెట్ అంగీకరించింది. కాగా రాష్ట్ర విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ప్రత్యేక సాయం చేసింది.
ఏపీకి ప్రత్యేక సాయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
Published Wed, Mar 15 2017 8:24 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement