న్యూఢిల్లీ : రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధింపుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో పరిస్థితిపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించాలా? విధిస్తే కొత్త చిక్కులేమైనా వస్తాయా అని కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది.
సాయంత్రం మరోసారి కేంద్ర కేబినెట్ సమావేశమయ్యే అవకాశం ఉంది. మరో వైపు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తూ గవర్నర్ పంపిన నివేదిక కేంద్రానికి చేరింది. తెలంగాణ బిల్లు రాజ్యసభ ముందుకు నేడు రానున్న సమయంలో తొందరపడి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనపై నిర్ణయం తీసుకోవడం సరికాదేమోననే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు కనిపిస్తోంది.