న్యూఢిల్లీ: లాక్ డౌన్ కారణంగా భారీగా నష్టపోయిన రైల్వే ఆదాయ పెంపుపై మార్గాలను అన్వేషిస్తోంది. ముఖ్యంగా, వస్తు రవాణా ద్వారా ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. డిస్కౌంట్స్, లేట్ డెలివరీకి క్యాష్‌బ్యాక్స్, ఎక్కువ దూరం రవాణా చేయాల్సిన ఆర్డర్లకు కన్సెషన్స్.. మొదలైనవాటిని ప్రారంభించాలనుకుంటోంది. లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్, మే నెలల్లో రూ. 8,283 కోట్ల వస్తు రవాణా ఆదాయాన్ని రైల్వే విభాగం కోల్పోయింది. రైల్వే ద్వారా వస్తు రవాణాను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో రైల్వే మంత్రి పియూష్ గోయల్ మంగళవారం సమీక్ష జరిపారు. రైల్వే ద్వారా సరకు రవాణా అవకాశాలపై స్థానిక వ్యాపారవేత్తలకు అవగాహన కల్పించాలని జోనల్ అధికారులకు సూచించారు. తేజస్ రైళ్లలో ఆలస్యం అయితే ప్రయాణీకులకు పరిహారం ఇస్తున్న తీరులోనే.. సరకు రవాణా ఆలస్యమైతే పరిహారం ఇచ్చే అంశం సహా పలు ఇతర ప్రతిపాదనలపై ఆ సమావేశంలో చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment