Central Railway Department
-
ప్రమాద రహిత రైల్వేలు కలేనా?
పశ్చిమ బెంగాల్‌లోని రంగపాణి రైల్వే స్టేషన్ సమీపంలో మరో ఘోర రైలు ప్రమాదం జరిగింది. డౌన్ కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు వెనుక నుండి ఢీకొట్టడంతో చాలా మంది మరణించారు. అనేకమంది గాయపడ్డారు. రైల్వేవారు భద్రతా ప్రమాణాల పట్ల సరియైన శ్రద్ధ, చిత్తశుద్ధి కనపరచడం లేదనటానికి ఈ ప్రమాదం ఒక నిదర్శనం. ఈ ప్రమాదం అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది. గూడ్స్ రైలు నిర్దేశించిన వేగం కంటే అధిక వేగంతో నడపడానికి ఎందుకు అనుమతించారు? అసలు రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై వెళ్ళటానికి బాధ్యులు ఎవరు?ఈ సంఘటన మానవ తప్పిదమని, దుర్ఘటనకు గూడ్స్‌రైలు డ్రైవర్ కారణమని రైల్వే వర్గాలు తెలుపుతున్నాయి. ఈ సందర్భంగా మానవ వనరుల కొరత సంగతీ వెలుగులోకి వస్తోంది. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలను దాదాపు ఇరవై వేలు ఏళ్లతరబడి నింపకుండా వదిలేశారు. ఈ మానవ వనరుల కొరత... రైలు డ్రైవర్లు ఎక్కువ షిఫ్టులలో పనిచేయడానికి దారితీస్తోంది. ఫలితంగా ఘోరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి.2016లో ప్రారంభించిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (కవచ్)ను ఫీల్డ్ ట్రయల్స్ కోసం కేవలం 1,500 కిలోమీటర్ల కంటే తక్కువ రైల్వే ట్రాక్‌లలో మాత్రమే ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. భారతీయ రైల్వేల మొత్తం ట్రాక్ దాదాపు 70 వేల కిలోమీటర్లు. కాలానుగుణంగా అవసరాలకు తగ్గట్టు కవచ్ వంటి భద్రతా వ్యవస్థల ఏర్పాటుతోపాటు, మౌలిక సదుపాయాల ఆధునికీకరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి.నాణ్యతతో కూడిన భద్రతా పరికరాలు ఏర్పాటు చేయాలి. ఈ దుర్ఘటనపై న్యాయవిచారణ జరిపి బాధ్యులైన వారిని గుర్తించి శిక్షించాలి. అదేవిధంగా ఇటువంటి దుర్ఘటనలు మునుముందు ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ప్రభుత్వం, రైల్వే బోర్డు వారు, రైల్వే శాఖలోని అన్ని విభాగాల ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు, సాంకేతిక నిపుణులు, మేధావులు, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కూడిన ఒక సంఘాన్ని ఏర్పాటు చే సి; దాని సూచనలతో కఠినమైన భద్రతా నియమ నిబంధనలు రూపొందించాలి.వీటిని కఠినంగా అమలుపరచడానికి అవసరమైతే పార్లమెంట్లో ఒక చట్టం చేయాలి. రైల్వేలోని అన్ని విభాగాలలో ఖాళీలను వెనువెంటనే భర్తీ చేయాలి. ఆధునిక అత్యంత సాంకేతికతతో వేగంగా నడిచే ‘వందే భారత్’ రైళ్ళతో సమానంగా అదే స్థాయిలో భద్రతతో కూడిన సురక్షితమైన ప్రయాణ పరిస్థితులు కల్పించినప్పుడే భారత రైల్వే పట్ల ప్రయాణికులకు ఒక భరోసా కలుగుతుంది. – దండంరాజు రాంచందర్ రావు, హైదరాబాద్ -
ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్.. త్వరలో కొత్త వెర్షన్ వందే భరత్ రైళ్లు
-
త్వరలోనే ఆ జిల్లాలో జెట్ స్పీడ్ బుల్లెట్ రైళ్లు..
అబ్బురపరిచే వేగం.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం.. అద్భుతమైన నిర్మాణాలు.. అత్యుత్తమ సౌకర్యాలు.. అలసట తెలియని ప్రయాణం.. అతితక్కువ సమయంలోనే గమ్యస్థానానికి చేర్చేందుకు గంటకు 350 కిలోమీటర్ల స్పీడుతో దూసుకెళ్లే బుల్లెట్ రైళ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేకంగా నిర్మించనున్న ట్రాక్‌పై చెన్నై– మైసూరు మధ్య పరుగులు తీయనున్నాయి. జర్మన్ టెక్నాలజీతో దేశంలోనే ఆరో కారిడార్‌గా ఈ మార్గాన్ని అభివృద్ధి పరిచేందుకు సర్వే పనులు సాగుతున్నాయి. ఇందుకోసం వివిధ విభాగాల వారీగా పలు కంపెనీలు టెండర్లు దక్కించుకున్నాయి. జిల్లా మీదుగా సాగే ట్రాక్ ఏర్పాటుకు సంబంధించి బెంచిమార్క్లు నిర్మాణమవుతున్నాయి. పలమనేరు (చిత్తూరు): జపాన్, జర్మనీ దేశాల్లో కనిపించే జెట్ స్పీడ్ బుల్లెట్ రైళ్లను త్వరలోనే జిల్లాలోనూ చూడబోతున్నాం. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకత. ఇప్పటి వరకు దేశంలోనే అత్యంత వేగంగా నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో చెన్నై నుంచి 320 కిలోమీటర్ల దూరంలోని బెంగళూరుకు ప్రయాణించాలంటే గంటకు 70 కి.మీ సగటున దాదాపు ఐదు గంటల సమయం పట్టేది. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ ద్వారా అయితే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం రెండు గంటలే. ఇప్పటికే దేశంలో ముంబై–అహ్మదాబాద్, ఢిల్లీ–వారణాసితో పాటు మరో మూడు మార్గాల్లో బుల్లెట్ ట్రైన్ కారిడార్లున్నాయి. ఆరో మార్గంగా చెన్నై–మైసూర్ కారిడార్‌ను జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం 2018లోనే జర్మన్ ప్రభుత్వంతో సంప్రదింపులు చేసింది. 2020 జూన్‌లో చెన్నై–మైసూర్ రైల్యే కారిడార్ నిర్మాణానికి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం నుంచి తమిళనాడు సరిహద్దు వరకు ప్రాథమిక సర్వేతోపాటు బెంచిమార్క్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఖరారైన టెండర్లు కేంద్ర రైల్యేశాఖ ఎన్హెచ్ఆర్ఆర్సీఎల్ (నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్)ద్వారా చెన్నై–మైసూరు బుల్లెట్ ట్రైన్ పనులు చేపడుతోంది. 2019లోనే ఇందుకు సంబందించి డీపీఆర్ (డీటైల్ ప్రాజెక్టు రిపోర్ట్) సిద్ధం చేసింది. ఈ మార్గానికి సంబంధించిన ఇప్పటికే టెండర్ల పక్రియను సైతం పూర్తి చేసింది. అందులో భాగంగా సర్వే పనులను ఇంజినీరింగ్ మాగ్నిట్యూడ్ కంపెనీ దక్కించుకుంది. ట్రాఫిక్‌కు సంబంధించిన పనులను పీకే ఇంజనీర్స్కంపెనీ, జనరల్ అలైన్మెంట్ డ్రాయింగ్స్‌ను ట్రాన్స్‌లింక్ కంపెనీ, ఫైనల్ అలైన్‌మెంట్‌ను ఆర్వీ అసోసియేట్స్, ఓవర్‌హెడ్, అండర్‌గ్రౌండ్ పనులను సుబుది టెక్నాలజీస్ కంపెనీ చేపడుతోంది. ఆర్ఏపీ ( రీసెటిల్మెంట్ యాక్షన్‌ప్లాన్)ని ఓవర్సీస్ మిన్–టెక్ కన్సల్టెంట్స్, ఎన్విరాల్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్‌ను మరో కంపెనీ చేపట్టనున్నట్టు ప్రస్తుతం ఇక్కడ పనులు చేస్తున్న కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. స్టాపింగ్ స్టేషన్లు తొమ్మిదే.. చెన్నై నుంచి మైసూరు మార్గంలో కేవలం తొమ్మిది స్టాపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. తమిళనాడులో చెన్నై, పూనమలై, అరక్కోణం, కర్ణాటకలో బంగారుపేట, బెంగళూరు, చెన్నపట్న, మండ్య, మైసూరు, జిల్లాలో కేవలం చిత్తూరులో మాత్రమే బుల్లెట్ రైళ్లు ఆగనున్నాయి. కారిడార్‌కు సమీపంలోనే చెన్నై–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌హైవే ఉండేలా మార్గంలో అలైన్మెంట్ చేశారు. ఈ ప్రాజెక్టులో అండర్‌గ్రౌండ్ ( సొరంగమార్గం), ఎలివేషన్ వయాడక్ట్, ఓవర్‌హెడ్, ఫ్లైఓవర్ వంతెనలతో ట్రాక్ నిర్మాణం సాగనుంది. బెంగళూరులో రెండు అండర్‌గ్రౌండ్ రైల్యే స్టేషన్లు సైతం నిర్మించేలా ప్రణాళికలో పొందుపరిచారు. తక్కువ సమయంలోనే గమ్యస్థానం చెన్నై–మైసూర్ మధ్య 435 కిలోమీటర్ల దూరం ఉంది. బుల్లెట్ ట్రైన్ గంటకు 350 కిలోమీటర్లు ప్రయాణిస్తే దాదాపు ఒకటిన్నర గంటలో చేరుకోవచ్చు. సగటు వేగం గంటకు 320 కిలోమీర్లు అయితే సుమారు రెండు గంటలు పట్టొచ్చు. 9 స్టేషన్లలో ఆపిన సమయాన్ని లెక్కగడితే మరో 45 నిమిషాలు మాత్రమే అదనంగా పరిగణించవచ్చు. ఆ లెక్కన 2.45 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకొనే అవకాశం ఉంటుంది. జిల్లాలో ప్రారంభమైన సర్వే కర్ణాటక సరిహద్దుల నుంచి జిల్లాలోని వి.కోట, బైరెడ్డిపల్లె, పలమనేరు మండలాల మీదుగా తమిళనాడు సరిహదులోని గుడిపాల మండలం వరకు ట్రాక్ నిర్మాణం కోసం శరవేగంగా సర్వే సాగుతోంది. ముఖ్యంగా పలమనేరు మండలంలోని సాకేవూరు, బేలపల్లె, కొలమాసనపల్లె, కూర్మాయి. పెంగరగుంట, సముద్రపల్లె సమీపంలో బెంచిమార్కులను ఏర్పాటు చేస్తున్నారు. భూకంపాలను తట్టుకొనే సామర్థ్యం బుల్లెట్ ట్రైన్ ట్రాక్‌ను అత్యాధుని పరిజ్ఞానంతో భూకంపాలను సైతం తట్టుకునేలా నిర్మించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టం ఉంటుందని సర్వే చేస్తున్న కంపెనీ ప్రతినిధులు తెలిపారు. బుల్లెట్ ట్రైన్, ట్రాక్ ప్రత్యేకతలు ►రైలు అత్యధిక వేగం గంటకు 350 కిలోమీటర్లు ►ఆపరేషన్ స్పీడ్ గంటకు 320 కిలోమీటర్లు ►ట్రాక్గేజ్ : స్టాండర్డ్ (1435 mm) ►డీఎస్– ఏటీజీ సిగ్నలింగ్ ►ట్రైన్ కెపాసిటీ : 750 మంది ప్రయాణికులు ►చెన్నై–మైసూర్ మధ్య దూరం 435 కిలోమీటర్లు ►రైలు స్టాపింగ్ స్టేషన్లు : 9 -
డిస్కౌంట్స్.. క్యాష్‌బ్యాక్స్
న్యూఢిల్లీ: లాక్ డౌన్ కారణంగా భారీగా నష్టపోయిన రైల్వే ఆదాయ పెంపుపై మార్గాలను అన్వేషిస్తోంది. ముఖ్యంగా, వస్తు రవాణా ద్వారా ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. డిస్కౌంట్స్, లేట్ డెలివరీకి క్యాష్‌బ్యాక్స్, ఎక్కువ దూరం రవాణా చేయాల్సిన ఆర్డర్లకు కన్సెషన్స్.. మొదలైనవాటిని ప్రారంభించాలనుకుంటోంది. లాక్డౌన్ కారణంగా ఏప్రిల్, మే నెలల్లో రూ. 8,283 కోట్ల వస్తు రవాణా ఆదాయాన్ని రైల్వే విభాగం కోల్పోయింది. రైల్వే ద్వారా వస్తు రవాణాను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో రైల్వే మంత్రి పియూష్ గోయల్ మంగళవారం సమీక్ష జరిపారు. రైల్వే ద్వారా సరకు రవాణా అవకాశాలపై స్థానిక వ్యాపారవేత్తలకు అవగాహన కల్పించాలని జోనల్ అధికారులకు సూచించారు. తేజస్ రైళ్లలో ఆలస్యం అయితే ప్రయాణీకులకు పరిహారం ఇస్తున్న తీరులోనే.. సరకు రవాణా ఆలస్యమైతే పరిహారం ఇచ్చే అంశం సహా పలు ఇతర ప్రతిపాదనలపై ఆ సమావేశంలో చర్చించారు. -
‘గుంటూరు–గుంతకల్లు’ డబ్లింగ్‌కు ఓకే
రూ.3,631 కోట్ల అంచనా వ్యయం, ఐదేళ్లలో పూర్తి సాక్షి, న్యూఢిల్లీ: గుంటూరు–గుంతకల్లు మధ్య విద్యుదీకరణతో కూడిన రెండో రైల్వే లైను నిర్మాణానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకుంది. రూ.3,631 కోట్ల అంచనా వ్యయంతో 401.47 కి.మీ. మేర రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఐదేళ్లలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని కేంద్ర రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం భరిస్తాయి. రాజధాని నుంచి రాయలసీమ ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీని పెంచాలంటూ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్టు సీసీఈఏ అభిప్రాయపడింది. గుంటూరు–గుంతకల్లు మధ్య గణనీయమైన స్థాయిలో ట్రాఫిక్ ఉందని, డబుల్ లైన్ నిర్మాణంతో భవిష్యత్తు అవసరాలనూ తీర్చుతుందని మంత్రిమండలి వివరాలను వెల్లడించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ రైల్వే లైన్ వల్ల గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మీడియాకు వివరిం చారు.రాయల సీమనుంచి రవాణా మెరుగు అవుతుం దన్నారు. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల నుంచి బెంగళూరు చేరేందుకు సులువుగా ఉంటుందని పేర్కొన్నారు.