కేంద్ర మంత్రితో ఏపీ సీఎం భేటీ
ఢిల్లీ : కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై కేంద్ర మంత్రితో ఏపీ సీఎం చర్చించారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి విమానాశ్రయాల విస్తరణ అంశాలపై వీరిద్దరు చర్చించినట్లు సమాచారం. సింగపూర్ పర్యటన ముగించుకుని చంద్రబాబు మంగళవారం రాత్రి న్యూఢిల్లీ చేరుకున్న విషయం విదితమే. నేడు కేంద్ర మంత్రులు, ఇతర అధికారులు, నేతలతో ఏపీ సీఎం సమావేశం కానున్నారు.