ఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ను అధికారులు బుధవారం తీహార్ జైలుకు తరలించారు. సీబీఐ విచారణ అనంతరం ఛోటారాజన్‌కు కస్టడీని పొడిగించిన న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తిరిగి డిసెంబర్ 3న కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా స్పెషల్ జడ్జి ఓపి సైనీ ఆదేశించారు.
కాగా, ఫేక్ పాస్ పోర్టు కేసులో సుదీర్ఘకాలంగా తప్పించుకు తిరుగుతున్న మాఫియా డాన్ రాజేంద్ర సదాశివ్ నిఖల్జీ అలియాస్ చోటారాజన్‌పై హత్యకేసు, డ్రగ్స్, సహా 85 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా వున్నాడు. అయితే ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర గుజరాత్, పోలీసుల నుంచి 71 కేసులను సీబీఐ విచారణకు స్వీకరించింది. ఇండోనేషియాలో పట్టుబడ్డ చోటా రాజన్‌ను ఇంటర్‌పోల్ సహాయంతో ప్రత్యేక విమానంలో అధికారులు భారత్‌కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే.