sent
-
ఏ జంతువులు అంతరిక్షాన్ని చూశాయి? తాబేళ్లు, ఈగలు ఏం చేశాయి?
మనుషులే కాదు ఎన్నో జంతువులను కూడా అంతరిక్షంలోకి పంపారు. ఈగలు, కుక్కలు, ఎలుకలు, చేపలు, కోతులు, చింపాంజీలను వివిధ ప్రయోజనాల కోసం అంతరిక్షంలోకి పంపారు. జంతువులను అంతరిక్షంలోకి పంపే ప్రక్రియ 21వ శతాబ్దంలోనూ కొనసాగింది. దీని సాయంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అనేక ప్రయోగాలు నిర్వహించారు. అంతరిక్ష రంగంలో నూతన విజయాలు సాధించినప్పుడల్లా మనం శాస్త్రవేత్తల కృషిని మెచ్చుకుంటాం. అయితే పలు జంతువులు కూడా ఈ విజయంలో భాగస్వామయ్యమయ్యాయనే సంగతిని మరచిపోతుంటాం. మనుషులు అంతరిక్షంలోకి వెళ్లకముందు పలు జంతువులను అక్కడికి పంపించారు. ఆ తర్వాతే మనుషులను అక్కడికి సురక్షితంగా పంపించవచ్చని శాస్త్రవేత్తలు గ్రహించారు. ఏఏ జంతువులు అంతరిక్షంలోకి పంపారో ఇప్పుడు తెలుసుకుందాం. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి జీవులు ఈగలు, వీటిని 1947లో అమెరికా శాస్త్రవేత్తలు పంపారు. నాడు శాస్త్రవేత్తలు.. వ్యోమగాములపై ఖగోళ రేడియేషన్ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలనుకున్నారు. V-2 బాలిస్టిక్ క్షిపణిని ఉపయోగించి, 109 కిలోమీటర్ల ఎత్తుకు ఈగలను అంతరిక్షంలోకి పంపారు. పారాచూట్ ద్వారా వాటిని న్యూ మెక్సికోలో దింపారు. క్యాప్సూల్స్ తెరిచినప్పుడు ఈగలు సజీవంగా కనిపించాయి. అంతరిక్షంలోకి పంపబడిన జంతువులలో కోతుల జాతులు ఉన్నాయి. వీటిలో రీసస్ మకాక్స్, పిగ్-టెయిల్డ్ కోతులు, స్క్విరెల్-టెయిల్డ్ కోతులు, చింపాంజీలు కూడా ఉన్నాయి. ఆల్బర్ట్- II అనే పేరుగల రీసస్ మకాక్ 1949లో 134 కిలోమీటర్ల వరకూ చేరుకుంది. అయితే అది తిరిగి వస్తుండగా మృతి చెందింది. దీని తరువాత 1961 లో కోతి జాతికి చెందిన హామ్ అనే చింపాంజీని నాసా అంతరిక్షంలోకి పంపింది, అది సురక్షితంగా తిరిగి వచ్చింది. మానవ ఆరోగ్యం, ఔషధాల తయారీ మొదలైన పరిశోధనలలో ఎలుకలను ఎక్కువగా ఉపయోగిస్తారు. మానవులపై అంతరిక్ష వాతావరణం ప్రభావాన్ని తెలుసుకునేందుకు ఎలుకలను అంతరిక్షంలోకి పంపారు. ఎలుకల అంతరిక్ష అనుభవాల గురించి నాసా ఒక వివరణాత్మక అధ్యయనాన్ని కూడా నిర్వహించింది. 1950లో 137 కిలోమీటర్ల వరకు అంతరిక్షంలోకి తొలి ఎలుకను పంపారు. అయితే అది పారాచూట్ ఫెయిల్యూర్‌తో మృతి చెందింది. సోవియట్ యూనియన్ గరిష్ట సంఖ్యలో కుక్కలను అంతరిక్షంలోకి పంపింది. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది 1957లో లైకా అనే శునకం. అయితే అది భూమికి తిరిగి రాలేకపోయింది. ఇది అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి జంతువుగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే దీనికి ముందు కూడా కొన్ని కుక్కలను అంతరిక్షంలోకి పంపారు. ఆశ్చర్యంగా అనిపించినా అంతరిక్షంలోకి తాబేలును కూడా పంపిన మాట మాత్రం నిజం. 1968లో అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య చంద్రుడిపైకి వెళ్లేందుకు పోటీ నెలకొన్న నేపధ్యంలో రష్యా రెండు తాబేళ్లను జోండ్ 5 అనే అంతరిక్ష నౌకలో అంతరిక్షంలోకి పంపింది. అవి చంద్రుని చుట్టూ ఆరు రోజులు తిరిగిన తర్వాత భూమికి తిరిగి వచ్చాయి. అయితే అవి ప్రణాళిక ప్రకారం కజకిస్తాన్‌లో ల్యాండ్ కాకుండా హిందూ మహాసముద్రంలో పడిపోయాయి. అయితే వాటిని రక్షించారు. నాసా ఈ జంతువులనే కాకుండా, కప్పలు, సాలెపురుగులు (1973), చేపలు (1973), టార్డిగ్రేడ్ (2007), పిల్లి (1963) ని అంతరిక్షంలోకి పంపింది. 2012లో జపాన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేపలను పంపింది. ఇంతేకాకుండా అనేక మొక్కలపై, ముఖ్యంగా ఆహారం తయారీపై అంతరిక్షంలో పలు ప్రయోగాలు జరిగాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సూక్ష్మజీవుల పెరుగుదలపై కూడా అనేక ప్రయోగాలు జరిగాయి. ఇది కూడా చదవండి: పుతిన్ రష్యా అధ్యక్షుడెలా అయ్యారు? -
ఐఏఎస్ అశోక్ ఖేమ్కా వాట్సాప్‌లో ఏం చేశారంటే...
చత్తీస్ఘడ్: కమ్యూనికేషన్ రంగంలో వస్తున్నసాంకేతిక విప్లవం నేపథ్యంలో హర్యానా కోర్టు ఓ ఆసక్తికర చర్య తీసుకుంది. దేశంలో మొట్టమొదటి సారి సోషల్ నెట్వర్కింగ్ సైట్ వాట్సాప్‌ద్వారా సమన్లు జారీ అయ్యాయి. సంచలన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా ఈ సంచలనానికి తెరతీసారు. ఖేమ్కా నేతృత్వంలోని ఫైనాన్సియల్ కమిషనర్ (ఎఫ్‌సీ) కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ వాట్సాప్ ప్రింట్ అవుట్నే సమన్ల డెలివరీ ప్రూఫ్‌గా పరిగణించాలని ఆదేశించారు. కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో సివిల్, రెవెన్యూ తగాదాలను పరిష్కరించే ఎఫ్‌సీ కోర్టు దృష్టికి హిసార్ లోని ఔరంగ్ షాపూర్ గ్రామానికా చెందిన అన్నదమ్ముల ఆస్తి పంపకాల తగాదా ఒకటి వచ్చింది. సత్బీర్ సింగ్‌కు, సోదరులు రామ్ దయాల్, క్రిష్టన్ కుమార్‌లతో ఈ వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారంలో సమాధానం చెప్పాల్సిందిగా రామ్, క్రిష్ణన్ కుమార్ లకు నోటీసులు పంపింది. అయితే రామదయాల్ నోటీసులను స్వీకరించారు కానీ, ఖాట్మాండులో ఉన్న క్రిష్ణన్ కుమార్‌కు నోటీసులు అందించండం సాధ్యం కాలేదు. దీనికితోడు స్థానిక రెవెన్యూ అధికారులు ఫోన్ ద్వారా ఆయనను సంప్రదించినపుడు చిరునామా, తదితర వివరాలు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో ఖేమ్కా ఈ నిర్ణయంతీ సుకున్నారు. ప్రస్తుతం ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ తదితర చిరునామాగా పరిగణిస్తున్న నేపథ్యంలో వాట్సాప్ ద్వారా కోర్టు ముద్రతో కూడిన నోటీసు కాపీని కోర్టుని జత చేసి వాట్సాప్ లో పంపించింది. ఈ వాట్సాప్ మెసేజ్ డెలివరీ ప్రింట్ అవుట్ నే సమన్లు జారీ అయినందుకు సాక్ష్యంగా పరిగణించనుంది. కాగా హర్యానాకు చెందిన అశోక్ ఖెమ్కా నిజాయితీ ఐఏఎస్ అధికారిగా పేరు గడించారు. ముఖ్యంగా భూ వ్యవహారాల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ భూ బకాసురులకు సింహస్వప్నంగా నిలిచారు. అంతేకాదు 46సార్లు బదిలీ అయిన ఏకైక ఐఏఎస్ అధికారికూడా ఈయనే. -
హోదా గురించి మాట్లాడే వారిపై అణచివేత ధోరణి
-
కటకటాల్లోకి కేటుగాడు
మెడికల్ సీట్ ఇప్పిస్తానని దగా నిందితుడి అరెస్ట్ బంజారాహిల్స్: తాను ఓ మంత్రి పీఏనని, మెడికల్ సీటు ఇప్పిస్తానని డబ్బు తీసుకుని మోసం చేసిన కేటుగాడిని బంజారాహిల్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా చెర్కుపల్లి గ్రామానికి చెందిన మేకల రఘురాంరెడ్డి అలియాస్ రఘుమారెడ్డి తాను ఓ మంత్రి పీఏనని బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని అమృతా ఎన్‌క్లేవ్‌లో నివసించే సయ్యద్ అతర్ హుస్సేన్(20)ను పరిచయం చేసుకున్నాడు. తనకు మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో సంబంధాలున్నాయని, గతంలో చాలా మందికి ఎంబీబీఎస్ సీట్లు ఇప్పించానని నమ్మబలికాడు.అతర్ హుస్సేన్‌కు మెడికల్ సీటు ఇప్పిస్తానని రూ. 85 లక్షలు వసూలు చేశాడు. సీటు రాకపోవడంతో బాధితుడు నిలదీయగా అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ చివరకు ముఖం చాటేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితు అతర్ హుస్సేన్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు రఘురాంరెడ్డిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఎన్ఐఏ కస్టడీకి పాక్ ఉగ్రవాది..
శ్రీనగర్ః పాకిస్తానీ ఉగ్రవాది బహదూర్ అలికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 12 రోజుల రిమాండ్ విధించింది. ప్రాణాలతో పట్టుబడ్డ బహదూర్ అలి... అలియాస్ సైఫుల్లాను ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కశ్మీర్ భద్రతా దళాలతో జరిగిన ఎన్ కౌంటర్ లో మరో నలుగురు ఉగ్రవాదులు చనిపోగా బహదూర్ అలి ప్రాణాలతో చిక్కిన విషయం తెలిసిందే. అలిని అదుపులోకి తీసుకున్న భద్రతా దళాలు అప్పటినుంచీ ఎన్ఐఏ పర్యవేక్షణలోనే ఉంచారు. ఈ నేపథ్యంలో విచారించిన ఎన్ఐఏ ముందు బహదూర్.. పలు సంచలన విషయాలను వెల్లడించాడు. కశ్మీర్ లో అమాయక పౌరులన్ని చంపేందుకే తాను వచ్చినట్లు ఎన్ఐఏ కు చెప్పిన బహదూర్... తనకు లష్కరే తోయిబా శిక్షణ ఇచ్చినట్లు తెలిపాడు. అంతేకాక తాను జెఈఎమ్ అధినేత హపీజ్ సయీద్ ను సైతం రెండుసార్లు కలిశానని, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో నెలకొన్న కంట్రోల్ రూమ్ తో రెగ్యులర్ టచ్ లోనే ఉన్నట్లు పేర్కొన్నాడు. బహదూర్ ఆసక్తికర, ఆశ్చర్యకర విషయాలను వెల్లడించిన అనంతరం.. హోం మంత్రిత్వశాఖ అతడిని పాకిస్తానీ పౌరుడుగా నిర్థారించింది. ఈ నేపథ్యంలో బహదూర్ ను ఆగస్టు 11 వరకూ ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
భారీగా తరలిపోతున్న సంపద
ముంబై : భారతీయులు రికార్డు స్థాయిలో నగదును విదేశాలకు తరలించారట. దాదాపు 460 కోట్ల డాలర్లను విదేశాలకు తరలించారని గణాంకాలు తెలుపుతున్నాయి. అయితే గతేడాది ఈ మొత్తం 160కోట్ల డాలర్లేనట. సరళీకరణ చెల్లింపుల పథకం(ఎల్ఆర్ఎస్) ప్రకారం ఒక ఏడాదిలో 2 లక్షల 50వేల డాలర్లను ఒక వ్యక్తి విదేశాలకు తరలించుకోవచ్చు. అయితే 2013 సెప్టెంబర్ వరకూ తక్కువగా ఉన్న ఈ చెల్లింపుల పరిమితి, 2015 మే నుంచి 2 లక్షల 50వేల డాలర్లకు పెంచడంతో ఒక్కసారిగా విదేశాలకు రెమిటెన్స్ పెరిగాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గిఫ్టీ రూపంలో, బంధువుల సంరక్షణ కోసం, విదేశాల్లో పెట్టుబడుల నిమిత్తం, ఏదైనా ఆస్తిని విదేశాల్లో కొనుగోలు వంటి రూపాల్లో భారతీయులు తమ నగదును విదేశాలకు తరలిస్తుంటారు. బంధువుల సంరక్షణ కోసం, విదేశాల్లో చదువులకు ఈ సారి ఎక్కువ మొత్తంలో నగదును విదేశాలకు పంపినట్టు తెలుస్తోంది. ఎక్కువ రెమిటెన్స్ లిమిట్, పన్నుల చట్టాలు కఠినతరం, భారత రూపాయి విలువ పడిపోవడం వంటివి విదేశాలకు నగదు తరలింపుకు దారితీశాయని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. బంధువుల సంరక్షణకు, విదేశాల్లో చదువుకు మే 2015 నుంచి ఎల్ఆర్ఎస్ ను విస్తృతపరిచి ఎక్కువ మొత్తానికి అనుమతించడంతో ఈ మొత్తం పెరిగిందని ఆర్బీఐ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. -
తీహార్ జైలుకు చోటా రాజన్
ఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ను అధికారులు బుధవారం తీహార్ జైలుకు తరలించారు. సీబీఐ విచారణ అనంతరం ఛోటారాజన్‌కు కస్టడీని పొడిగించిన న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తిరిగి డిసెంబర్ 3న కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా స్పెషల్ జడ్జి ఓపి సైనీ ఆదేశించారు. కాగా, ఫేక్ పాస్ పోర్టు కేసులో సుదీర్ఘకాలంగా తప్పించుకు తిరుగుతున్న మాఫియా డాన్ రాజేంద్ర సదాశివ్ నిఖల్జీ అలియాస్ చోటారాజన్‌పై హత్యకేసు, డ్రగ్స్, సహా 85 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా వున్నాడు. అయితే ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర గుజరాత్, పోలీసుల నుంచి 71 కేసులను సీబీఐ విచారణకు స్వీకరించింది. ఇండోనేషియాలో పట్టుబడ్డ చోటా రాజన్‌ను ఇంటర్‌పోల్ సహాయంతో ప్రత్యేక విమానంలో అధికారులు భారత్‌కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే.