ఎన్ఐఏ కస్టడీకి పాక్ ఉగ్రవాది.. | Pakistani terrorist Bahadur Ali sent to NIA custody till Aug 11 | Sakshi
Sakshi News home page

ఎన్ఐఏ కస్టడీకి పాక్ ఉగ్రవాది..

Published Sat, Jul 30 2016 5:52 PM | Last Updated on Sat, Mar 23 2019 8:33 PM

ఎన్ఐఏ కస్టడీకి పాక్ ఉగ్రవాది.. - Sakshi

ఎన్ఐఏ కస్టడీకి పాక్ ఉగ్రవాది..

శ్రీనగర్ః పాకిస్తానీ ఉగ్రవాది బహదూర్ అలికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 12 రోజుల రిమాండ్ విధించింది.   ప్రాణాలతో పట్టుబడ్డ బహదూర్ అలి... అలియాస్ సైఫుల్లాను ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కశ్మీర్ భద్రతా దళాలతో జరిగిన ఎన్ కౌంటర్ లో మరో నలుగురు ఉగ్రవాదులు చనిపోగా బహదూర్ అలి ప్రాణాలతో చిక్కిన విషయం తెలిసిందే. అలిని అదుపులోకి తీసుకున్న భద్రతా దళాలు అప్పటినుంచీ ఎన్ఐఏ పర్యవేక్షణలోనే ఉంచారు. ఈ నేపథ్యంలో విచారించిన ఎన్ఐఏ ముందు బహదూర్.. పలు సంచలన విషయాలను వెల్లడించాడు. కశ్మీర్ లో అమాయక పౌరులన్ని చంపేందుకే తాను వచ్చినట్లు ఎన్ఐఏ కు చెప్పిన బహదూర్... తనకు లష్కరే తోయిబా శిక్షణ ఇచ్చినట్లు తెలిపాడు. అంతేకాక తాను జెఈఎమ్ అధినేత హపీజ్ సయీద్ ను సైతం రెండుసార్లు కలిశానని, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో నెలకొన్న కంట్రోల్ రూమ్ తో రెగ్యులర్ టచ్ లోనే ఉన్నట్లు  పేర్కొన్నాడు. బహదూర్ ఆసక్తికర, ఆశ్చర్యకర విషయాలను వెల్లడించిన అనంతరం.. హోం మంత్రిత్వశాఖ  అతడిని పాకిస్తానీ పౌరుడుగా నిర్థారించింది.  ఈ నేపథ్యంలో బహదూర్ ను ఆగస్టు 11 వరకూ ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement