గట్టిగా తిప్పికొట్టిన భారత బలగాలు
న్యూఢిల్లీ: చైనా సైనికులు మరోసారి నియంత్రణ రేఖను దాటేందుకు ప్రయత్నించారు. జమ్మూ కాశ్మీర్లోని తూర్పు లడఖ్ ప్రాంతంలో పాన్‌గాంగ్ సరస్సులో నియంత్రణ రేఖ దాటి భారత్‌వైపు వచ్చేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) సైనికులు ప్రయత్నించగా... మనదేశ సైనికులు గట్టిగా తిప్పికొట్టారు. ఇది శుక్రవారం జరిగినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఆర్మీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం...
ఈ నెల 27న పాన్‌గాంగ్ సరస్సులో నియంత్రణ రేఖగా భావించే ప్రాంతం దాటి చైనా సైనికులు పడవల్లో భారత్‌వైపునకు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఇరు దేశాల సైనికులు పోటాపోటీగా తమ జాతీయ పతాకాలను ప్రదర్శించారు. ఇరువురు తమ ప్రాంతంగా సందేశమిచ్చుకున్నారు. ఈ సరస్సు మొత్తం విస్తీర్ణంలో 45 కిలోమీటర్లు భారత్‌లో, 90 కిలోమీటర్ల మేర చైనాలో ఉంటుంది. చైనా గస్తీ సైనికులు తరచూ నియంత్రణ రేఖను దాటే ప్రయత్నం చేస్తుండగా... మన దేశ సైనికులు అత్యాధునిక పడవల సాయంతో వారి యత్నాలను భగ్నం చేస్తూ వస్తున్నారని తెలుస్తోంది.
భారత జలాల్లో చొరబాటుకు చైనా యత్నాలు!
Published Mon, Jun 30 2014 1:00 AM | Last Updated on Mon, Aug 13 2018 3:45 PM
Advertisement
Advertisement