చెన్నై: ప్రకృతి విలయం నుంచి ఇపుడిపుడే తేరుకుంటున్న చెన్నైవాసులకు కొంతమంది విద్యార్థులు అందించిన బుడత సాయం అందరినీ ఆకట్టుకుంటోంది. దేశం నలుమూలల నుంచి సాయం అందుతున్న భారీ సహాయం ఒక ఎత్తయితే, పెద్ద మనసుతో వీరు అందించిన సాయం మరో ఎత్తు. ఇంతకీ బాధితులకు వారు పంచిపెట్టిన వస్తువులు ఏంటో తెలుసా.. 80 టవల్స్, 2,800 రూపాయలు. అయితేనేం ఆపదల్లో ఉన్న వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో వారు చూపించిన ఔదార్యం ప్రశంసలందుకుంటోంది. తొమ్మిది, పదేళ్ల వయసున్న వీరంతా 5 వ తరగతి చదువుతున్న విద్యార్థులు కావడం విశేషం.