జయలలితకు షాక్! | CM jayalalitha to lose power: exit polls | Sakshi
Sakshi News home page

జయలలితకు షాక్!

Published Mon, May 16 2016 7:14 PM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM

జయలలితకు షాక్!

జయలలితకు షాక్!

చెన్నై: తమిళనాడులో 'అమ్మ'కు ఈసారి భంగపాటు తప్పదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ముఖ్యమంత్రి పీఠాన్ని జయలలిత నిలుపుకోవడం కష్టమేనని సర్వేలు చెబుతున్నాయి. కురువృద్ధుడు కరుణానిధిపై తమిళ ఓటర్లు కరుణ చూపారని అంటున్నాయి.

234 అసెంబ్లీ స్థానాల్లో డీఎంకే 114-118, అన్నాడీఎంకే 95-99, పీడబ్ల్యూఎఫ్‌ 14, బీజేపీ 4 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని తమిళనాడు న్యూస్ నేషన్ సర్వే వెల్లడించింది.  డీఎంకే 124-140, అన్నాడీఎంకే 89-101, బీజేపీ 0-3 సీట్లలో విజయం సాధించే అవకాశముందని తమిళనాడు ఇండియాటుడే అంచనా వేసింది. డీఎంకే 106-120, అన్నాడీఎంకే 89-101, పీడబ్ల్యూఎఫ్ 4-8, బీజేపీ 0-3 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందని తమిళనాడు యాక్సిస్ ఇండియా సర్వే తెలిపింది.

తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 69.19 శాతం పోలింగ్ నమోదైంది. 8 జిల్లాల్లో వర్షాలు కురవడంతో పోలింగ్ సమయాన్ని రాత్రి 7 గంటలకు వరకు పొడిగించారు. పోలింగ్ శాతం మరింత పెరగనుంది. ఈ నెల 19న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement