శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠకు తెరపడలేదు. ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీతో జట్టు కట్టడం సహా అన్ని అవకాశాలూ తమ ముందున్నాయని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధికార ప్రతినిధి నయీమ్ అక్తర్ పునరుద్ఘాటించారు. ఇతర పార్టీలతో దోస్తీకి అందుబాటులో ఉన్న అవకాశాలపై కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో అనధికార చర్చలు జరిగాయని ఆదివారం తెలిపారు.
మరోవైపు బీజేపీతో పొత్తుపై ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో పీడీపీ డోలాయమానంలో పడినట్టు తెలుస్తోంది. దీంతో 12 మంది ఎమ్మెల్యేలుగల కాంగ్రెస్, 15 మంది ఎమ్మెల్యేలు గల ఎన్‌సీతో పీడీపీ చర్చలు జరుపుతోంది. కాగా, పీడీపీతో అంగీకారం కుదరకపోతే జనవరి 1న గవర్నర్‌తో భేటీలో తమకు 30 మంది ఎమ్మెల్యేల బలం ఉందంటూ బీజేపీ జాబితాను ఇవ్వనున్నట్టు సమాచారం.
‘కశ్మీర్’పై వీడని ఉత్కంఠ
Published Mon, Dec 29 2014 2:21 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement