మత, విశ్వాసాలను మార్చుకునే స్వేచ్ఛ భారతీయులందరి ప్రాథమిక హక్కు అని ఉపరాష్ట్రపతి అన్సారీ తేల్చిచెప్పారు.
న్యూఢిల్లీ: మత, విశ్వాసాలను మార్చుకునే స్వేచ్ఛ భారతీయులందరి ప్రాథమిక హక్కు అని ఉపరాష్ట్రపతి అన్సారీ తేల్చిచెప్పారు. అధికారిక మతంగా ఏ మతాన్ని గుర్తించకూడదన్నారు. న్యూఢిల్లీలో అంతర్జాతీయ అధ్యయన సదస్సులో సోమవారం ‘అంతర్జాతీయ సంబంధాల్లో లౌకికతపై కొన్ని ఆలోచనలు’ అంశంపై మాట్లాడారు. భారతదేశ లౌకికవాదం మతాన్ని, రాజ్యాన్ని విడదీస్తూ అడ్డుగోడను నిర్మించదు. కానీ వాటిమధ్య విలువలతో కూడిన దూరాన్ని ప్రతిపాదిస్తుందన్నారు.