సికర్(రాజస్థాన్): తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజస్థాన్‌లో అభివృద్ధి కుంటుపడిందన్న విమర్శలను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తిప్పికొట్టారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధిని పోల్చి చూడాలని ప్రజలను కోరారు. రాజస్థాన్‌లో సీఎం గెహ్లాట్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పలు సంక్షేమ పథకాలను ప్రారంభించిందని, బీజేపీ హయాంలో ఇలాంటి పథకాలు ఏవీ లేవని చెప్పారు. బుధవారం సికర్‌లోని క్రీడా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో సోనియా ప్రసంగించారు.
కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. వారు(బీజేపీ) అధికారంలో ఉండగా ఏం చేశారు? ఉచిత చికిత్స సదుపాయం కల్పించారా? పేదల గురించి పట్టించుకున్నారా? రాష్ట్రంలో సమస్యల గురించి ఏనాడైనా ఆలోచించారా? ’ అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ స్వీయ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. యూపీఏ పాలనలో రైతులు, మహిళలు, గిరిజనుల సంక్షేమం కోసం పలు చర్యలు తీసుకున్నామన్నారు. సమాచార చట్టం, ఉపాధిహామీ, ఆహార భద్రత చట్టాలను ప్రవేశపెట్టామని తెలిపారు. రాజస్థాన్‌లో గెహ్లాట్ ప్రభుత్వం సంక్షేమ బాటలో నడుస్తూ చక్కటి పాలన అందిస్తోందని కితాబిచ్చారు.
పోల్చి చూడండి: సోనియా
Published Thu, Nov 28 2013 3:25 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement