
అహ్మదాబాద్ : ప్రజల నాడీ పట్టడంలో తెలివిగా వ్యవహరిస్తారు రాజకీయ నాయకులు. కానీ ఈ నాయకుడికి ప్రజల నాడీతో పాటు పాములను పట్టడంలోనూ నైపుణ్యం ఉంది. దారి తప్పి తన నివాసానికి వచ్చిన విషపామును తానే స్వయంగా పట్టుకొని అడవిలో విడిచి పెట్టారు గుజరాత్ కాంగ్రెస్ లీడర్.
కాంగ్రెస్ లీడర్, గుజరాత్ అసెంబ్లీ ప్రతిపక్షనేత పరేష్ ధనాని నివాసంలోకి ఓ విష పాము చొరబడింది. గమనించిన పరేష్ స్వయంగా వెళ్లి పాము తోక పట్టుకొని నేర్పుతో బుట్టలో వేశారు. పరేష్ చేసిన చిన్న పాటి సాహసాన్ని తన అనుచరుడు ఒకరు వీడియో తీశారు.
ఈ వీడియోను పరేష్ ధనాని ఫేస్‌బుక్, ట్వీటర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అయింది. ‘ పాపం ఈ పాము దారి తప్పి నా నివాసానికి వచ్చింది. కానీ నాకు పాము పట్టుకునే నైపుణ్యం ఉంది’ అనే క్యాప్షన్ పెట్టి ట్వీటర్‌లో పోస్ట్ చేశారు. ఆ పామును స్థానికంగా ఉన్న అడవిలో విడిచిపెట్టామని పరేష్ ధనాని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment