
కాంగ్రెస్ నాపై సీబీఐని ఉసిగొల్పుతోంది: నరేంద్ర మోడీ
బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అధికార కాంగ్రెస్ పార్టీపై దాడిని ముమ్మరం చేశారు. కేంద్ర ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుని సీబీఐని ఉసిగొల్పుతోందని ఆరోపించారు. సోమవారం ఇక్కడ జరిగిన సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తూ.. ఇలాంటి బెదిరింపులకు తాను బయపడనని చెప్పారు.
తాము అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని కేంద్రం భావిస్తోందని విమర్శించారు. తమను బయపెట్టేందుకు సీబీఐని దుర్వినియోగం చేస్తోందన మండిపడ్డారు. ములయాం సింగ్ యాదవ్, మాయావతి కేసుల్లో మౌనంగా ఉన్న సీబీఐ తన విషయంలో మరోలా వ్యవహరిస్తోందని మోడీ ఆరోపించారు. సీబీఐ, ఐబీ రాకే కాదు ప్రపంచంలోని ఏ దర్యాప్తు సంస్థకూ తాను బయపడనని వ్యాఖ్యానించారు. ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉన్న పార్టీలనే ఆదరిస్తారన్నారు. మోడీ ప్రసంగానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.