డైరీ లీక్స్‌ : బీజేపీ నేతలకు రూ 1800 కోట్ల ముడుపులు | Congress Questions BJP Over Report Of Payoffs To Top Leaders | Sakshi
Sakshi News home page

డైరీ లీక్స్‌ : బీజేపీ నేతలకు రూ 1800 కోట్ల ముడుపులు

Published Fri, Mar 22 2019 3:04 PM | Last Updated on Fri, Mar 22 2019 3:06 PM

Congress Questions BJP Over Report Of Payoffs To Top Leaders - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో పాలక బీజేపీని ఇరుకునపెట్టేందుకు కాంగ్రెస్‌కు సరికొత్త అస్త్రం అందివచ్చింది. బీజేపీ అగ్రనేతలకు కర్నాటక మాజీ సీఎం, పార్టీ సీనియర్‌ నేత బీఎస్‌ యడ్యూరప్ప నుంచి రూ 1800 కోట్ల ముడుపులు ముట్టాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఓ వార్తాపత్రిక కథనాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జీవాలా బీజేపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు.

అరుణ్‌ జైట్లీ, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ సహా పలువురు బీజేపీ జాతీయ నేతలు, పెద్దసంఖ్యలో న్యాయమూర్తులు, అడ్వకేట్లకు డబ్బు ఇచ్చినట్టు యడ్యూరప్ప తన డైరీల్లో రాసుకున్నారని ఈ కథనం వెల్లడించడం కలకలం రేపింది. ఈ వార్తా కథనంపై బీజేపీ నేతలు స్పందించాలని సుర్జీవాలా డిమాండ్‌ చేశారు. ఈ కథనం వాస్తవమా..కాదా అనేది బీజేపీ తక్షణమే వివరణ ఇవ్వాలని కోరారు. యడ్యూరప్ప సంతకంతో కూడిన ఈ డైరీ 2017 నుంచి ఆదాయ పన్ను అధికారుల వద్ద ఉన్నప్పటికీ దీనిపై లోతైన విచారణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement