న్యూఢిల్లీ : ప్రియాంక గాంధీ వాద్రా(47) రాజకీయ ప్రవేశంతో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం కనపడుతోంది. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రియాంకకు కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో కార్యకర్తలతో పాటు అభిమానులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. చిన్నతనంలో ప్రియాంక.. తమ నానమ్మ ఇందిరా గాంధీతో ఆడుకుంటున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ ఫోటోతో పాటు ‘మా అమ్మలానే ప్రియాంక కూడా చాలా స్ట్రాంగ్’ అంటూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చెప్పిన ఓ మాటను కూడా కోట్ చేశారు. ‘బలమైన మహిళలు.. బలమైన మహిళల్నే పెంచుతారం’టూ పోస్ట్ చేసిన ఈ ఫోటోతో పాటు ‘నానమ్మలానే మనవరాలు కుటుంబం, ప్రేమ’ అనే హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం ప్రియాంక గాంధీ వాద్రాను తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే.
లోక్‌సభ ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించే 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్‌లో ఆమె తన సోదరుడు రాహుల్‌కు సహాయకారిగా పనిచేస్తారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో ప్రియాంక తన తల్లి సోనియా గాంధీ నియోజకవర్గం రాయ్‌బరేలీ నుంచి పోటీచేసే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment