బిలీనియర్ మీట్ ఎక్స్‌పోర్టర్ అరెస్ట్
బిలీనియర్ మీట్ ఎక్స్‌పోర్టర్ అరెస్ట్
Published Sat, Aug 26 2017 10:39 AM | Last Updated on Wed, Sep 5 2018 1:38 PM
సాక్షి, ఢిల్లీ: కోట్లాధిపతి అయిన మాంసం ఎగుమతిదారుడు, హవాలా డీలర్ మోయిన్ ఖురేషిని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఢిల్లీలో శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. అక్రమ హవాలా కార్యకలాపాలతో నగదును ట్రాన్సఫర్ చేపడుతున్నాడనే ఆరోపణల నేపథ్యంలో మోయిన్ ఖురేషిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నేడు(శనివారం) అతన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టబోతున్నారు. నేరపూరిత కుట్రలు కూడా ఈ మాంసం ఎగుమతిదారుడు, ఏక్యూఎం గ్రూప్ కంపెనీలు చేపడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఏజెన్సీ విచారణ కూడా జరిపింది.
మోయిన్ ఖురేషిపై వచ్చిన ఆరోపణలతో గత నెలలోనే దక్షిణ ఢిల్లీలో ఈడీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో అతను తన హవాలా ఛానళ్లను మనీ ఛేంజర్ సహాయంతో డబ్బును బదిలీ చేయడానికి ఉపయోగించాడని తెలిసింది. అనుమానిత డాక్యుమెంట్లను, జువెల్లరీని ఈడీ సీజ్ చేసింది. ఈ సీజ్ చేసిన వాటిలో సమాచారం మేరకు ఈడీ పలు దేశాలకు లేఖలు కూడా రాసింది. ఈ మాంసం ఎగుమతిదారుడితో ఉన్న సంబంధాలను ఈడీ ప్రశ్నించింది.
Advertisement