పేదరికం వల్లే మత మార్పిళ్లు: పూరి శంకరాచార్య
మథుర: దేశంలో పేదరికం వల్లే మతమార్పిడులు జరుగుతున్నాయని పూరి శంకరాచార్య స్వామి నిశ్ఛలానంద సరస్వతి అభిప్రాయపడ్డారు. బృందావన్లోని ఆయన ఆశ్రమం చైతన్య విహార్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మతమార్పిళ్లను అరికట్టాలంటే పేదరికం, నిరక్షరాస్యతల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు.
పేదరికం, అజ్ఞానం వల్లే హిందువులు మతం మారుతున్నారని ఆయన చెప్పారు. జీవితంలో అనేక బాధలు పడినవారు, ఇబ్బందులు ఎదుర్కొన్నవారే మతం మారుతున్నట్లు ఆయన తెలిపారు.ఈ అంశాన్ని లోతుగా అధ్యయనం చేయాలన్నారు. దీనిపై సుదీర్ఘ చర్చ జరగవలసిన అవసరం కూడా ఉందని శంకరాచార్య పేర్కొన్నారు.