న్యూఢిల్లీ : మత మార్పిడిల అంశంపై రాజ్యసభలో గురువారం కూడా గందరగోళం నెలకొంది. ఈ అంశంపై ప్రకటన చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభలోకి రావాలంటూ ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. సభలో ప్రకటన చేసేందుకు ప్రధాని ఎందుకు సిగ్గుపడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు.
ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని మరో సభ్యుడు ఆనంద్ శర్మ ఆరోపించారు. ఉభయసభల్లో లోక్‌సభ సవ్యంగా సాగుతోందని, రాజ్యసభలో గందరగోళానికి సభ్యుల అహంకారమే కారణమని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. సభ సద్దుమణగకపోవడంతో డిప్యూటీ చైర్మెన్ సభను వాయిదా వేశారు.
'మోదీ ఎందుకు సిగ్గుపడుతున్నారు?'
Published Thu, Dec 18 2014 1:03 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement