అహ్మదాబాద్: బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి జుగుప్సకరమైన పనులు చేసిన పోలీసు అధికారిపై వేటు పడింది. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూడాల్సిన ఆ పోలీసు అధికారి తన బాధ్యతలు మర్చిపోవడంతోపాటు పలువురు అమ్మాయిలను వేధించడంతోపాటు, ఓ మహిళను అభ్యంతరకరంగా ముట్టుకోవడం వంటి హీనమైన పనులు చేయడంతో అతడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సస్పెండ్ వేటు వేశారు.
గుజరాత్ లో చోటుచేసుకుంది. గత ఏడాది డిసెంబర్ 25 నుంచి 31 మధ్య గుజరాత్ లో కాంకారియా కార్నివాల్ జరిగింది. ఈ సందర్భంగా రామసిన్హా వాల్వాయి(48) అనే పోలీసు హెడ్ కానిస్టేబుల్ కు శాంతిభద్రతలు చూసుకునేందుకు విధులు అప్పగించారు. కానీ, అతడు మాత్రం తన విధులు మర్చిపోయి జాతరకు వచ్చిన అమ్మాయిలతో, ఓ మహిళతో అసభ్య కరంగా ప్రవర్తించాడు. దానికి సంబంధించిన వీడియో కూడా బయటకు రావడంతో అది సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీంతో అతడి గుర్తించేందుకు నానా తంటాలు పడిన పోలీసులు చివరకు ఆ వ్యక్తి రామసిన్హా అని గుర్తించి అరెస్టు చేశారు.
బందోబస్తుకెళ్లి బాలికల్ని బాధించినందుకు..
Published Tue, Jan 12 2016 7:46 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
Advertisement
Advertisement