girls and women
-
ఆమె'కు అవకాశమిస్తే.. సైన్స్ కు ఆకాశమే హద్దు
(రమేష్ గోగికారి): ‘ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం’ అంటూ ఎన్నో ఉపోద్ఘాతాలు.. రిజర్వేషన్ల కోసం పోరాటాలు.. ఎంతో కొంత మార్పు.. అయినా ఏదో వెలితి. కొన్ని రంగాలకే, ఓ స్థాయి వరకే మహిళలు పరిమితమవుతున్న పరిస్థితి. సైన్స్–టెక్నాలజీ రంగాల్లో, పరిశోధనల్లో వారు చాలా తక్కువ. మరి మహిళల మేధాశక్తి ఏమైనా తక్కువా? పురుషులతో సమానంగానేకాదు.. ఒకింత ఎక్కువే చేసి చూపగలమని నిరూపించిన మేరీ క్యూరీ వంటి శాస్త్రవేత్తలు ఎందరో. మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉన్నప్పుడే ఇంత సాంకేతికత, అభివృద్ధి జరుగుతుంటే.. ‘ఆమె’ తోడుంటే ఇంకెంత గొప్ప ఆవిష్కరణలు వస్తాయో, మరెంత అభివృద్ధి సాధ్యమో. చేయాల్సిందల్లా.. ‘ఆమె’కు అవకాశమివ్వడమే. రెండేళ్లపాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మొదలు.. భవిష్యత్తుపై భయం రేపుతున్న వాతావరణ మార్పుల (క్లైమేట్ చేంజ్) వరకు ఎన్నో సవాళ్లు. వాటిని ఎదుర్కొనే మార్గాలు, పరిష్కారాలను చూపగలిగేది సైన్స్ అండ్ టెక్నాలజీ. ప్రస్తుతం అత్యుత్తమ నైపుణ్యమున్న పరిశోధకుల కొరత ఈ రంగాలను వెంటాడుతోంది. ఇలాంటి సమయంలో ఆదుకోగలిగినది మహిళా శక్తే. ఇన్నాళ్లూ బాలికలు, మహిళలకు విద్యలో, అభిరుచికి తగిన రంగాల్లో సరైన అవకాశాలు అందక.. వారిలోని సామర్థ్యం వృథాగా పోతోంది. వారికి తగిన అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తే.. ఆకాశమే హద్దుగా వినూత్నమైన, విభిన్నమైన, అత్యాధునిక ఆలోచనలు, సాంకేతికతలను సృష్టించడం, అభివృద్ధి చేయడం వీలవుతుందనేది నిపుణుల మాట. ఇందుకోసం విద్యా రంగంలో బాలికలకు సమాన అవకాశాలు దక్కేలా చూడాలని.. శాస్త్ర, సాంకేతిక, పరిశోధన రంగాల్లో వారి సామర్థ్యాన్ని వెలికితీసేలా చర్యలు చేపట్టాలని వారు సూచిస్తున్నారు. మేరీ క్యూరీకి నివాళిగా..: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, తగిన ప్రోత్సాహం కోసం ‘మహిళలకు సైన్స్ కావాలి.. సైన్స్‌కు మహిళలు కావాలి’ అని ‘ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక విభాగం (యునెస్కో)’ నినాదం ఇచ్చింది. ప్రఖ్యాత శాస్త్రవేత్త మేరీ క్యూరీ జయంతి అయిన ఫిబ్రవరి 11వ తేదీని ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’గా నిర్వహించాలని 2015లో నిర్ణయించింది. సైన్స్–టెక్నాలజీ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ‘స్టెమ్’ రంగాల్లో ప్రోత్సాహం అవసరం: దశాబ్దాల ఎదురుచూపుల తర్వాత మన పార్లమెంటు ‘మహిళా రిజర్వేషన్ల బిల్లు’ను ఆమోదించింది. అది చట్టరూపమూ దాలి్చంది. ‘నారీ శక్తి’ అంటూ కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే రోజున త్రివిధ దళాల్లో మహిళాశక్తిని చాటింది. ఈ ‘నారీ శక్తి’ మరింత విస్తృతమై ‘స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడికల్)’ రంగాల్లో సత్తా చాటితే.. దేశ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. ప్రపంచగతిని మార్చిన మహిళా శాస్త్రవేత్తలు మరెందరో... ►1910వ దశాబ్దంలోనే కుష్టు రోగానికి చికిత్సను కనుగొన్న అలైస్ అగస్టా బాల్.. ►సూర్యుడు సహా విశ్వంలోని నక్షత్రాలన్నీ ఎక్కువభాగం హైడ్రోజన్, హీలియంతోనే నిండి ఉన్నాయని తొలిగా ప్రతిపాదించిన బ్రిటీష్–అమెరికన్ అంతరిక్ష శాస్త్రవేత్త సెసిలియా పేన్ గాపోష్కిన్..∙అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తమ ప్రయోగాల్లో కంప్యూటర్లను వినియోగించడానికి ముందు.. స్పేస్ ప్రయోగాల సమయాన్ని, వాటి ప్రయాణతీరును కచ్చితంగా గణించి చెప్పిన ‘హ్యూమన్ కంప్యూటర్’ కేథరిన్ జాన్సన్..∙ఇన్సూలిన్, పెన్సిలిన్, విటమిన్ బీ12 వంటి బయోరసాయనాల అణు నిర్మాణాన్ని ఎక్స్–రే క్రిస్టలోగ్రఫీ సాయంతో గుర్తించే విధానాన్ని అభివృద్ధి చేసిన డొరోతీ హాడ్కిన్ (ఇన్సూలిన్ వంటి బయో మాలిక్యూల్స్‌ను కృత్రిమంగా తయారు చేయడానికి ఈ విధానం తోడ్పడింది). మన దేశం నుంచీ ఎందరో.. ►మొక్కల కణాల్లో శక్తి ఉత్పాదనకు కీలకమైన ‘సైటోక్రోమ్ సీ’ అనే ఎంజైమ్‌ను గుర్తించిన మధ్యప్రదేశ్ శాస్త్రవేత్త కమలా సొహోనీ ►కేన్సర్‌ను నిరోధించే ‘వింకా ఆల్కలాయిడ్స్’, మలేరియా చికిత్స కోసం వాడే ఔషధాలపై పరిశోధన చేసిన రసాయన శాస్త్రవేత్త అసిమా చటర్జీ (పశ్చిమబెంగాల్).. ►మైక్రోవేవ్ పరికరాలపై పరిశోధన చేసి, మన దేశంలో తొలి మైక్రోవేవ్ రీసెర్చ్ ల్యాబ్ నెలకొలి్పన శాస్త్రవేత్త రాజేశ్వరి చటర్జీ (కర్ణాటక).. ఇటీవలి కాలాన్ని చూస్తే.. ►కోవిడ్ వైరస్ ధాటిని ముందే గుర్తించి హెచ్చరించిన భారత శాస్త్రవేత్త, డబ్ల్యూహెచ్ఓ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్.. ►పుణె వైరాలజీ ల్యాబ్‌లో కోవిడ్ వైరస్‌ను ఐసోలేట్ చేసి..కోవ్యాక్సిన్ రూపకల్పనకు మార్గం వేసిన ల్యాబ్ డైరెక్టర్ ప్రియా అబ్రహం.. ►అగ్ని–4,5 క్షిపణుల రూపకల్పన ప్రాజెక్టుకు హెడ్‌గా వ్యవహరించిన శాస్త్రవేత్త టెస్సీ థామస్.. ఇలా ఎందరో మహిళా శాస్త్రవేత్తలు ఈ రంగంలో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ తీరు సమాజానికి నష్టం మహిళలకు సైన్స్‌లో తగిన అవకాశాలొస్తే అద్భుతాలు సృష్టించగలరు. కానీ సమాజంలో మహిళలను డాక్టర్లు, టీచర్లు వంటి కొన్ని రంగాలవైపే మళ్లిస్తున్నారు. వినూత్న ఆలోచనలను, ఆవిష్కరణలను, అభివృద్ధి చెందే అవకాశాలను సమాజం కోల్పోతోంది. బాలికల్లో స్కూల్ స్థాయి నుంచే సైన్స్ పట్ల ఆసక్తిని గమనించి ప్రోత్సహిస్తున్నాం. – మర్లిన్ మనాస్, ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపాల్ తగిన ప్రోత్సాహం కావాలి నాకు సైన్స్, మేథమేటిక్స్ అంటే చాలా ఇష్టం. ఈ సబ్జెక్టుల్లో అన్ని అంశాలను ఆకళింపు చేసుకుని చదువుతున్నా.. భవిష్యత్తులో పరిశోధనలు చేసి, సమాజానికి పనికొచ్చే ఆవిష్కరణలు చేయాలని ఉంది. తగిన ప్రోత్సాహం అందిస్తే సాధిస్తానన్న నమ్మకముంది. – కేఎన్ శ్రీచరణి, ఇంటర్ ఫస్టియర్, మొయినాబాద్ ‘నోబెల్’కే ఘనతనిచ్చిన మేరీ క్యూరీ ఆధునిక ఫిజిక్స్ రూపునిచ్చిన శాస్త్రవేత్తల్లో మేరీ క్యూరీ ఒకరు. రెండు వేర్వేరు రంగాల్లో నోబెల్ పొందిన ఏకైక శాస్త్రవేత్త ఆమె. రేడియో ధార్మిక మూలకాలైన రేడియం, పోలోనియంలను క్యూరీ గుర్తించారు. ఆ రేడియం పేరు మీదుగానే రేడియేషన్ పదం పుట్టింది. ఈ పరిశోధనకుగాను 1903లో ‘ఫిజిక్స్ నోబెల్’ అందుకున్నారు. తర్వాత కెమిస్ట్రీలో పరిశోధనకు 1911లో ‘కెమిస్ట్రీ నోబెల్’ పొందారు. తన పరిశోధనల సమయంలో క్యూరీ ఎంతగా రేడియేషన్‌కు గురయ్యారంటే..ఆమె రాసిన నోట్ పుస్తకాల నుంచి ఇప్పటికీ రేడియేషన్ వెలువడుతోంది. అణుశక్తికి మార్గం చూపిన చీన్ షుంగ్ వు చైనాలో పుట్టినా అమెరికాలో స్థిరపడి అణుశక్తికి బాటలు వేసిన శాస్త్రవేత్త చీన్ షుంగ్ వు. అణుబాంబుల తయారీ కోసం ‘మాన్ హట్టన్ ప్రాజెక్టు’లో ఆమె కీలకపాత్ర పోషించారు. రసాయనిక ప్రక్రియల ద్వారా యురేనియం ఉత్పత్తి చేసే విధానాన్ని ఆవిష్కరించారు. కంప్యూటర్‌కు ‘భాష’ నేర్పిన గ్రేస్ హోపర్ తొలి ఎ ల్రక్టానిక్–డిజిటల్ కంప్యూటర్ ‘యూనివాక్’ ను రూపొందించిన బృందంలో కీలక పాత్ర పోషించింది అమెరికన్ శాస్త్రవేత్త గ్రేస్ హోపర్. ‘బైనరీ’ భాషలోకి మార్చే తొలి కంపైలర్ ప్రోగ్రామ్‌ను రూపొందించినది ఆమెనే. ‘కోబాల్’ ప్రోగ్రామ్ రూపకల్పనలోనూ ఈమెది కీలకపాత్రే. (యునెస్కో గణాంకాల ప్రకారం..) ►ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులలో మహిళల శాతం:33.3% చూడటానికి ఈ శాతం ఓ మోస్తరుగానే ఉన్నా.. కొన్ని విభాగాల్లోనే మహిళలకు అవకాశాలు అందుతున్నాయి. మహిళా పరిశోధకులకు సమాన అవకాశాలిస్తున్న దేశాలు: 30 ► చాలా దేశాల్లో మహిళా పరిశోధకుల సంఖ్య అతి తక్కువ. కీలక పరిశోధనలు చేసే అవకాశం, నిధుల వంటి అంశాల్లో వివక్షే ఎదురవుతోంది. ‘స్టెమ్’ విభాగాల్లోని విద్యార్థుల్లో మహిళలు: 35% ► మెడికల్, కొంతవరకు టెక్నాలజీ రంగంలోనే మహిళలు ఎక్కువ. తల్లిదండ్రులు, ఫ్యాకల్టీ ఈ రంగాల దిశగా బాలికలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు నోబెల్ పొందిన మహిళలు: 22 మంది ► పరిశోధన రంగంలో మహిళల భాగస్వామ్యం పెరిగినా.. ఉన్నతస్థాయి పోస్టులు, ప రిశోధక బృందాలకు నేతృత్వం వహించే అవకాశాలు తక్కువ. దీనితో మంచి ప్రతిభ ఉన్నా అవార్డులకు, గుర్తింపునకు నోచుకోవడం లేదు. ఈ తీరు సమాజానికి నష్టం మహిళలకు సైన్స్‌లో తగిన అవకాశాలొస్తే అద్భుతాలు సృష్టించగలరు. కానీ సమాజంలో మహిళలను డాక్టర్లు, టీచర్లు వంటి కొన్ని రంగాలవైపే మళ్లిస్తున్నారు. వినూత్న ఆలోచనలను, ఆవిష్కరణలను, అభివృద్ధి చెందే అవకాశాలను సమాజం కోల్పోతోంది. బాలికల్లో స్కూల్ స్థాయి నుంచే సైన్స్ పట్ల ఆసక్తిని గమనించి ప్రోత్సహిస్తున్నాం. – మర్లిన్ మనాస్, ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపాల్ తగిన ప్రోత్సాహం కావాలి నాకు సైన్స్, మేథమేటిక్స్ అంటే చాలా ఇష్టం. ఈ సబ్జెక్టుల్లో అన్ని అంశాలను ఆకళింపు చేసుకుని చదువుతున్నా.. భవిష్యత్తులో పరిశోధనలు చేసి, సమాజానికి పనికొచ్చే ఆవిష్కరణలు చేయాలని ఉంది. తగిన ప్రోత్సాహం అందిస్తే సాధిస్తానన్న నమ్మకముంది. – కేఎన్ శ్రీచరణి, ఇంటర్ ఫస్టియర్, మొయినాబాద్ నేడు (ఫిబ్రవరి 11న) ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’ సందర్భంగా.. -
National Crime Records Bureau: మూడేళ్లలో..13.13 లక్షల మంది మహిళలు మిస్సింగ్
న్యూఢిల్లీ: దేశంలో 2019–21 సంవత్సరాల మధ్య 13.13 లక్షల మంది బాలికలు, మహిళలు కనిపించకుండాపోయారని కేంద్రం తెలిపింది. ఇందులో మధ్యప్రదేశ్ నుంచి అత్యధికంగా సుమారు 2 లక్షల మంది ఉన్నారని, ఆ తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉందని పేర్కొంది. గత వారం పార్లమెంట్లో కేంద్ర హోం శాఖ ఇందుకు సంబంధించి నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) నమోదు చేసిన గణాంకాలను వెల్లడించింది. మూడేళ్ల కాలంలో మిస్సయిన మొత్తం 13.13 లక్షల మందిలో బాలికలు 2,51,430 మంది కాగా, 18 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 10,61,648 అని వివరించింది. 2019–2021 మధ్య మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 1,60,180 మహిళలు, 38,234 మంది బాలికలు అదృశ్యమయినట్లు ఆ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఉన్న పశ్చిమబెంగాల్లో 1,56,905 మంది మహిళలు, 36,606 మంది బాలికలు మిస్సయ్యారని తెలిపింది. ఇదే సమయంలో మహారాష్ట్రలో 1,78,400 మంది మహిళలు, 13,033 మంది బాలికలు.. ఒడిశాలో 70,222 మంది మహిళలు, 16,649 మంది బాలికలు..ఛత్తీస్‌గఢ్‌లో 49,116 మంది మహిళలు, 10,817 మంది బాలికలు కనిపించకుండాపోయారు. 2019–21 మధ్య ఢిల్లీలో 61,054 మంది మహిళలు, 22,919 మంది బాలికలు కనిపించకుండాపోయారు. -
వివాహ వయసు పెంపుపై చర్చ
సాక్షి, అమరావతి: పేదింటి బాలికలు సైతం ఉన్నత విద్యనభ్యసించేలా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని.. దీనికి అదనంగా యువతుల కనీస వివాహ వయసు పెంపు వంటి చర్యలు మహిళలు తమ లక్ష్యాలను సులువుగా సాధించేందుకు దోహదపడతాయని కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘బాల్య వివాహాల నిషేధ చట్టం (సవరణ)–బిల్లు 2021’పై అన్ని రాష్ట్రాల్లోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో బుధవారం ఆన్లైన్ సదస్సు జరిగింది. మన రాష్ట్రం నుంచి కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌తో పాటు వినుకొండ ఎంపీపీ, పలువురు మహిళా సర్పంచ్‌లు విజయవాడ ఏపీఎస్ఐఆర్డీ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. మహిళల వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచడం వల్ల కలిగే మంచి, చెడులపై ఎవరేమన్నారంటే.. వివాహ వయసు పెంపును స్వాగతిస్తున్నా.. 21 ఏళ్లు వచ్చిన తర్వాత వివాహాలు జరగడం వల్ల మహిళలకు బిడ్డను కనడానికి అనువుగా శారీరక పరిపుష్టత ఉంటుంది. బాలికల వివాహ వయసు పెంచడం ద్వారా బాలికలు విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయంగా వృద్ధిలోకి వస్తారు. – ఉప్పాల హారిక, జెడ్పీ చైర్పర్సన్, కృష్ణా జిల్లా విద్య, వృత్తి నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి 18 ఏళ్ల లోపే వివాహం చేయడాన్ని గ్రామాల్లోను, బలహీన వర్గాల్లోను నిషేధించడం కష్టంగా ఉంది. కాబట్టి మనం వివాహ వయసుపై కాకుండా బాలికా విద్య, వృత్తి నైపుణ్యాల పై దృష్టిసారించాలి. – జయశ్రీ, ఎంపీపీ, వినుకొండ. విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారానికి ప్రాధాన్యత వివాహ వయసు పెంపుదల గ్రామ స్థాయిలో పెద్దగా ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. మనం విద్య, ఆరోగ్యం, కౌమార బాలికలకు పౌష్టికాహారం, సాంకేతిక, వృత్తి విద్యపై పని చేయాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ జగబంధు, సర్పంచ్, శ్రీకాకుళం జిల్లా -
పసి మనసులను గాయపరుస్తున్న పాపాత్ములు
పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్లు.. కోపిష్టి కళ్లు. పాపిష్టి కళ్లల్లో పచ్చ కామెర్లు.. కోపిష్టి కళ్లల్లో కొరివి మంటలు.. అని ప్రముఖ కవి దేవులపల్లి వారు రాశారు. కవి కాంక్షించినట్టు.. పసికూనలపై కన్నెత్తి చూసే తోడేళ్లకు అలాంటి శిక్ష పడితే ఎంత బావుండును.. ముద్దులొలికే బంగారు తల్లుల నుంచి ముసలమ్మల వరకు ఆడది కనిపిస్తే చాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అత్యాచారాలతో మహిళలు వణికిపోతున్నారు. కిరాతకులకు కఠిన శిక్షణ పడాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. సాక్షి, విజయనగరం : ఇటీవలి కాలంలో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు కలవరపరుస్తున్నాయి. అసలు వీళ్లు మనుషులేనా.. మానవత్వం లేదా.. అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఇలాంటి కిరాతకుల్ని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ సోషల్ మీడియా వేదికగా ఊపందుకుంటోంది.మరోవైపు స్మార్ట్‌ఫోన్‌కు బానిసైన యువత అశ్లీల చిత్రాలను చూస్తూ.. కన్నుమిన్నూ కానకుండా కామాంధులుగా తయారవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వరంగల్ జిల్లాలో తొమ్మిది నెలల పసికందుపై హత్యాచారం మరువకముందే.. విజయనగరం జిల్లాలో నాలుగేళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. గతంలో సీతానగరం మండలం గాదెల వలస పాఠశాల పదోతరగతి విద్యార్థినిపై లైంగిక దాడి జరగడంతో కన్ను మూయడం తెలిసిందే. ఇటీవల గుర్ల మండలం దేవుణి కణపాక గ్రామానికి చెందిన ఓ యువతిపై పశువుల కాపరులు లైంగిక దాడి చేశారు. ఆ చిత్రాలను సెల్ఫోన్లో చిత్రీకరించి పైశాచికత్వాన్ని చాటుకున్నారు. తాజాగా బొబ్బిలిలో నాలుగేళ్ల చిన్నారిపై ఓ ఆకతాయి లైంగిక దాడికి పాల్పడటంతో తల్లిదండ్రులు తమ బిడ్డల సంరక్షణపై భయాందోళనలు చెందుతున్నారు. సోషల్ మీడియా వెర్రి తలలు సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయందోళన ప్రస్తుతం ఎక్కువైపోయింది. ముక్కూ మొహం తెలియని వారితో ఫేస్ బుక్ పరిచయాలు కుటుంబాలను చిధ్రం చేస్తున్నాయి. అన్నీ తెలిసినప్పటికీ, బానిసల్లా తయారవుతున్నారు. దీని ప్రభావం చాలా చోట్లా ఉంది. ఉదయం లేచిన వెంటనే దేవుని ముఖం చూడటం మానేసి.. సెల్ చూడటమనేది ఫ్యాషన్‌గా మారిపోయింది. రాత్రి పెట్టిన పోస్టులకు ఎన్ని లైక్లొచ్చాయన్నదే ముఖ్యం. ఇక ఆడపిల్లలు కూడా ఎక్కడ పడతే అక్కడ సెల్ఫీలు, ఎఫ్‌బీల్లో పోస్టింగ్‌లకే ప్రాధాన్యమిస్తున్నారు. అసలు ఎవరితో చాటింగ్ చేస్తున్నామనే అంశాలను మరిచిపోతున్నారు. చివరికి పూర్తిగా మోసపోయాక.. ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చాపకింద నీరులా విష సంస్కృతి మహిళలపై అకృత్యాల విష సంస్కృతి చాపకింద నీరులా పారుతోంది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచకపోవడం, లేకుంటే వారికి కావలసినంత స్వేచ్ఛ ఇవ్వడం చేస్తున్నారు. దీనివల్ల ఏది తప్పో, ఏది ఒప్పో తెలియని యుక్త వయసులో పలు రకాల తప్పిదాలకు అవకాశమిస్తున్నారు. వారి జీవితాలు అగమ్యగోచరం అయ్యేందుకు కారకులవుతున్నారు. ప్రధానంగా తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవడం, ఇద్దరూ ఉద్యోగస్తులు కావడం, పిల్లలు పెద్దవాళ్లయ్యారులే అన్న ఆలోచనతో వారేం చేస్తున్నారో పట్టించుకోకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇంటర్నెట్ చవగ్గా లభిస్తున్న రోజులు కావడంతో యువత తప్పుటడుగులు వేస్తోంది. మొబైల్లో నీలిచిత్రాలు చూడటం పెరిగింది. దీంతో విచక్షణ.. వావి వరుసలు కోల్పోయి అభం శుభం తెలియని ముక్కుపచ్చలారని పసికందులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులదే బాధ్యత ఒకప్పుడు ఆడపిల్లకు యుక్తవయసు వస్తే కాస్త భయపడేవారు. జాగ్రత్తగా ఉండాలని బుద్దులు చెప్పేవారు. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. ఆడపిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత కేవలం తల్లిదండ్రులదే. బయటి వ్యక్తులే కాదు ఇంట్లోని కుటుంబ సభ్యులను కూడా నమ్మలేని దౌర్భాగ్యం చోటు చేసుకుంటోంది. ఎవరినీ నమ్మకుండా తల్లిదండ్రులే పిల్లల్ని తమ కనుసన్నల్లో ఉంచి కాపాడుకోవాలన్న విషయాన్ని ఇటీవల జరిగిన సంఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. ఇదొక మానసిక వ్యాధి ఫీడోఫీలియా.. ఇదో మానసిక వ్యాధి. చిన్నపిల్లలతో సెక్స్ చేయాలనిపించడం దీని అర్థం. ఇలాంటి రోగులు పసిపిల్లలపై అకృత్యాలకు పాల్పడుతుంటారు. వ్యక్తుల వ్యక్తిత్వంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పులు, సమాజంలోని వికృత పోకడలకు ఆకర్షణ కావడం, వ్యక్తుల్లో విలువలు సన్నగిల్లిపోవడం జరుగుతున్నాయి. శరీరంలో అంతస్రావీ గ్రంధుల ప్రభావంతో వ్యక్తుల్లో టెస్టోస్టీరాన్ స్థాయిలు పెరిగిపోతాయి. ఆ సమయంలో ఎవరు కనిపిస్తే వారిపై ఆకృత్యాలకు పాల్పడతారు. వీటిని నిరోధించేందుకు సమాజంలో విలువలు నింపాలి. తల్లిదండ్రులు ఎవరినీ నమ్మి తమ పిల్లలను వదలకూడదు. ఎక్కువమంది ఈ అఘాయిత్యాలకు పాల్పడిన వారిలో కుటుంబ సంబంధీకులే ఉన్నారు. వారిలో మేనమామలు, చిన్నాన్నలు, మధ్య వయసున్న వారు, వృద్ధులు, తాగుబోతులు ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఏకాంతంగా వదిలేయడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. మానసిక కారణాలు కూడా చాలా ఉన్నాయి. – డాక్టర్ ఎన్వీఎస్ సూర్యనారాయణ, మానసిక నిపుణుడు -
బందోబస్తుకెళ్లి బాలికల్ని బాధించినందుకు..
అహ్మదాబాద్: బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి జుగుప్సకరమైన పనులు చేసిన పోలీసు అధికారిపై వేటు పడింది. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూడాల్సిన ఆ పోలీసు అధికారి తన బాధ్యతలు మర్చిపోవడంతోపాటు పలువురు అమ్మాయిలను వేధించడంతోపాటు, ఓ మహిళను అభ్యంతరకరంగా ముట్టుకోవడం వంటి హీనమైన పనులు చేయడంతో అతడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సస్పెండ్ వేటు వేశారు. గుజరాత్ లో చోటుచేసుకుంది. గత ఏడాది డిసెంబర్ 25 నుంచి 31 మధ్య గుజరాత్ లో కాంకారియా కార్నివాల్ జరిగింది. ఈ సందర్భంగా రామసిన్హా వాల్వాయి(48) అనే పోలీసు హెడ్ కానిస్టేబుల్ కు శాంతిభద్రతలు చూసుకునేందుకు విధులు అప్పగించారు. కానీ, అతడు మాత్రం తన విధులు మర్చిపోయి జాతరకు వచ్చిన అమ్మాయిలతో, ఓ మహిళతో అసభ్య కరంగా ప్రవర్తించాడు. దానికి సంబంధించిన వీడియో కూడా బయటకు రావడంతో అది సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీంతో అతడి గుర్తించేందుకు నానా తంటాలు పడిన పోలీసులు చివరకు ఆ వ్యక్తి రామసిన్హా అని గుర్తించి అరెస్టు చేశారు. -
అకృత్యాలకు అంతం లేదా?
నిన్న అరుణ.. నేడు రేవతి.. రేపు ఇంకెవరో! దేశంలో అమ్మాయిల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. రెండేళ్ల పాటు ప్రేమించి, కాలక్షేం చేసి.. చివరకు పెళ్లి చేసుకొమ్మని అడిగినందుకు కిరోసిన్ పోసి తగలబెట్టేశాడో దుర్మార్గుడు. ఈ దారుణం నల్లగొండ జిల్లాలో జరిగింది. ఆ సంఘటనలో తీవ్రంగా గాయపడిన బీటెక్ విద్యార్థిని అరుణ.. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అసువులు బాసింది. ఇక మూడు నాలుగు రోజుల్లో పెళ్లి ఉందనగా, ఇంకా కాళ్ల పారాణి పెట్టుకోక ముందే, పట్టుబట్టలు కట్టుకోకముందే కాటికి పంపేశాడో నీచుడు. ప్రేమిస్తున్నానని వేధించాడు. కాదు, నేను చదువుకుంటున్నానని ఆమె తిరస్కరించింది. పెద్దలు కూడా మందలించారు. ఈలోపు ఆమెకు పెళ్లి కుదిరింది. అంతే, అతడిలోని రాక్షసుడు నిద్రలేచాడు. ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని, ఇంటికి వెళ్లి ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈమె కూడా బీటెక్ విద్యార్థినే. ఈ ఇద్దరు అమ్మాయిల ఉదంతాలు ఒకే సమయంలో.. ఒకేలా చోటుచేసుకున్నాయి. రోడ్డుమీదకు అమ్మాయి వెళ్లిందంటే ఎలా తిరిగొస్తుందోనని తల్లిదండ్రులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని భయపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారి మానప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతోంది. కంటికి కాస్త నదురుగా కనపడితే చాలు.. ప్రేమిస్తున్నామంటూ వెంటపడుతున్నారు. కొంతమంది దాన్ని నిరాకరిస్తుంటే, మరికొందరు అమాయకంగా ఆ వలలో పడిపోతున్నారు. ఏం చేసినా చివరకు మాత్రం వారి కథలు విషాదాంతాలే అవుతున్నాయి. పాపం అరుణ, రేవతి ఆస్పత్రులలో నాలుగైదు రోజుల పాటు నరకయాతన అనుభవించారు. దాదాపు 60-70 శాతం వరకు శరీరంపై కాలిన గాయాలు అయినప్పుడు ఎంత నరకం అనుభవిస్తారో!! కాకినాడ ఆస్పత్రిలో రేవతి పెట్టిన కేకలు ఇప్పటికీ ఆ తల్లిదండ్రుల గుండెల్లోనే కాదు.. చూసిన ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా అంతా అయిపోయిన తర్వాత నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామంటూ చెబుతున్నారు తప్ప.. వీటిని నిరోధించడానికి చర్యలు తీసుకున్న పాపాన పోవట్లేదు. పెప్పర్ స్ప్రేలు, లేజర్ గన్నుల్లాంటివి వచ్చాయని చెబుతున్నా.. అవి ఎంతమందికి అందుబాటులో ఉంటున్నాయో ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆ తల్లిదండ్రుల కడుపుకోతను ఎవరు తీరుస్తారు? చిన్నపిల్లలని కూడా చూడకుండా కామాంధులు కాటేస్తుంటే.. ఈ యంత్రాంగం మాత్రం కుంభకర్ణుడి వారసత్వం తీసుకుంటోంది. దేవుడా రక్షించు ఈ దేశాన్ని.. కామాంధుల నుంచి.. ప్రేమ ముసుగులోని కాళ రాక్షసుల నుంచి!!