న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,380 కరోనా కేసులు నమోదు కాగా, 193 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,82,143కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఒక్క రోజు వ్యవధిలో దేశంలో ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు 86,983 మంది కరోనా నుంచి కోలుకోగా.. 5,164 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 89,995 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. (చదవండి : గ్లోబల్ లీడర్‌గా భారత్!)
ముఖ్యంగా దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌లలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. అత్యధికంగా మహారాష్ట్రలో 65 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, 2,197 మంది మృతిచెందారు. అయితే భారత్‌లో రికవరీ రేటులో పెరుగుదల కాస్త ఊరట కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment