సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అల్లకల్లోలగా మారింది. రోజురోజుకి అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అక్కడ దాదాపు 1500 మంది ఈ మహమ్మారికి బలయ్యారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడానికి అగ్రరాజ్యం విశ్వప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు భారత్‌లోనూ కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరిగిపోతుంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడాను. మహమ్మారి కరోనా వైరస్‌పై పోరాడే విషయంలో మా ఇద్దరి మధ్య విస్త్రతంగా చర్చ జరిగింది. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి భారత్-అమెరికా పూర్తిస్థాయిలో అంగీకారానికి వచ్చాము’అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 3072 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 75 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో అత్యధికంగా 490 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Had an extensive telephone conversation with President @realDonaldTrump. We had a good discussion, and agreed to deploy the full strength of the India-US partnership to fight COVID-19.
— Narendra Modi (@narendramodi) April 4, 2020
చదవండి:
కరోనా: కనికాకు బిగ్ రిలీఫ్
కరోనాపై గెలిచి.. సగర్వంగా ఇంటికి..
Comments
Please login to add a commentAdd a comment