చెన్నై: చైనా నుంచి దిగుమతి చేసుకున్న 24 వేల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను తిప్పి పంపనున్నట్టు తమిళనాడు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. చైనా ర్యాపిడ్ కిట్ల వినియోగించొద్దని ఐసీఎంఆర్ మార్గదర్శకాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, చైనాలోని రెండు కంపెనీల నుంచి భారత్ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, రాజస్తాన్‌తో పాటు మరో మూడు రాష్ట్రాలు టెస్టింగ్ కిట్ల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశాయి.
(చదవండి: లాక్‌డౌన్: అక్కడ మరికొన్ని సడలింపులు)
టెస్టింగ్ కిట్ల ద్వారా కరోనా వైరస్ నిర్ధారణ 5.4 శాతం మాత్రమే కచ్చితత్వాన్ని కలిగి ఉందని రాజస్తాన్ వెల్లడించింది. దీంతో వాటిని ఆయా కంపెనీలకు తిప్పి పంపేందుకు భారత పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సిద్ధమైంది. ఇక ఐసీఎఆర్ సూచనల మేరకు మరిన్ని టెస్టింగ్ కిట్ల కొనుగోలు ఆర్డర్లను రద్దు చేసుకున్నట్టు తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సి.విజయభాస్కర్ తెలిపారు. ఇదిలాఉండగా.. చైనా టెస్టింగ్ కిట్లకు తమిళనాడు ప్రభుత్వం అధిక ధరలు చెల్లించిందని ప్రతిపక్ష డీఎంకే ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే, భారత ప్రభుత్వం కొనుగోలు చేసిన ధరలనే తామూ చెల్లించామని ప్రభుత్వం పేర్కొంది.
(చదవండి: అక్కడ మాస్కు ధరించకపోతే అదే శిక్ష)
Comments
Please login to add a commentAdd a comment