
ఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. రోజుల గడుస్తున్న కొద్దీ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది తప్ప తగ్గడం లేదు. తాజాగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6654 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,25,101కి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 137 మంది మరణించడంతో దేశంలో మృతుల సంఖ్య 3720కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 51,783 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 69,597 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
(జ్యోతి కుమారి నిజంగా అద్భుతం : ఇవాంక)
Comments
Please login to add a commentAdd a comment