
న్యూడిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి విధ్వంసం సృష్టిస్తోంది. మంగళవారం ఉదయం నాటికి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటేసింది. గడిచిన 24 గంటల్లో 4,970 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 134 మంది మృతి చెందడం మరింత ఆందోళనగా మారింది. ఇప్పటివరకూ భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 1,01,139కి చేరగా, మృతుల సంఖ్య 3,163కు చేరింది. కాగా కరోనా వైరస్ నుంచి 39,173 మంది పూర్తిగా కోలుకోగా, దేశంలో ప్రస్తుతం 58,802 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 48 లక్షలు దాటగా.. మృతుల సంఖ్య 3.18 లక్షలకు చేరుకుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 17.86 లక్షల మంది కోలుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment